బాలీవుడ్ దిగ్గజ నటుడు  రిషీకపూర్ కన్నుమూయడం బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో తీరని విషాదాన్ని నింపిన విషయం తెలిసిందే. ఎంతో మంది సినీ ప్రముఖులు బాలీవుడ్ దిగ్గజ నటుడైన రిషి కపూర్ మరణం పై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు బాలీవుడ్ చిత్ర పరిశ్రమ మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. ఇక కేవలం బాలీవుడ్ చిత్ర పరిశ్రమ ప్రముఖులే కాకుండా టాలీవుడ్ చిత్ర పరిశ్రమ ప్రముఖులతో పాటు ఎంతోమంది రాజకీయ ప్రముఖులు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సంతాపం వ్యక్తం చేశారు.కాగా బాలీవుడ్ చిత్ర పరిశ్రమ రెండు రోజుల వ్యవధిలోనే ఇద్దరు లెజెండరీ నటులను కోల్పోయింది. 

 

 ఇదిలా ఉంటే తాజాగా రిషి కపూర్ చనిపోకముందు ఆయన చివరి వీడియో అంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అయిపోతుంది. చిరునవ్వుతో రిషి కపూర్ ఈ వీడియోలో కనిపించడం చూస్తే రిషి ఇక లేరనే నిజం నమ్మబుద్ధి కాదు అంటే అతిశయోక్తి కాదు. ఈ వీడియో చూసిన చాలా మంది ప్రముఖులు అభిమానులు తీవ్ర భావోద్వేగానికి గురి అవుతున్నారు. రిషి కపూర్ ఆరోగ్యం విషమించి ముంబైలోని సర్ హెచ్ఎన్  రిలయన్స్ ఫౌండేషన్ ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆసుపత్రి సిబ్బంది ఒకరు రిషి కపూర్ ని ఆప్యాయంగా పలకరించి.. ఆయన సినిమాలోని ఓ పాటను  బాగా పాడి వినిపించారు. 

 

ఇక ఆ వ్యక్తి పాట పాడుతున్నంత  సేపు రిషి కపూర్ హాయిగా ఆ పాటను వింటూ నవ్వులు చిందించారు రిషి కపూర్. అనంతరం ఆ యువకుడికి రిషి కపూర్ తన ఆశీస్సులను ఇచ్చారు. కాగా  దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో బుధవారం రాత్రి లేదా గురువారం ఉదయం పూట రికార్డ్ చేసి ఉండవచ్చని కొందరు చెబుతుంటే... ఏడాది ప్రారంభంలో రిషి కపూర్ ఆసుపత్రికి వచ్చిన సమయంలో ఈ వీడియో రికార్డ్ చేసి ఉండవచ్చని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఇంకొంత మంది అభిమానులు ఆయన చివరి క్షణాల్లో కూడా నవ్వుతూనే వెళ్లిపోయారు అంటూ భావోద్వేగానికి గురి అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: