ఎవరైనా ఒక కథ రెడీ చేసేందుకు ఆరు నెలలు.. ఒక్కోసారి ఏడాది టైమ్ తీసుకుంటారు. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి మాత్రం నాలుగు, అయిదు కథలు రెడీ చేసేస్తున్నాడు. సరిలేరు నీకెవ్వరు తర్వాత ఎఫ్ 3 స్క్రిప్ట్ పనిలో బిజీగా ఉన్న అనిల్ ఇద్దరు సీనియర్ హీరోలను.. ఒక స్టార్ హీరోను లైన్ లో పెట్టేసి స్క్రిప్ట్ లు ప్రిపేర్ చేస్తున్నాడు. 

 

లాక్ డౌన్ హాలిడేస్ ను అనిల్ రావిపూడి 100 పర్సెంట్ ఉపయోగించుకుంటున్నాడు. ఒక సినిమా పూర్తయిన తర్వాతే మరో సినిమా కథను రెడీ చేసే అనిల్ రావిపూడి ఏకంగా మూడు, నాలుగు సినిమాలను లైన్ లో పెట్టాడు. సరిలేరు నీకెవ్వరు తర్వాత రెడీ చేస్తున్న ఎఫ్ 3తో తెలుగులో ఫ్రాంచైజీస్ ట్రెండ్ క్రియేట్ చేస్తున్నాడు దర్శకుడు. హిందీలో గోలీమార్.. ధూమ్ సిరీస్ మాదిరి.. హాలీవుడ్ లో మిషన్ ఇంపాజిబుల్ మాదిరి ఎఫ్ 2ను కూడా ఫ్రాంచైజీస్ మూవీస్ లా లైన్ గా తీయాలని ప్లాన్ చేస్తున్నాడు. 

 

ఎఫ్ 3 కథను దాదాపుగా పూర్తి చేశాడు అనిల్ రావిపూడి. డైలాగ్ వర్షన్ పూర్తిచేయడంతో.. షూటింగ్స్ కు అనుమతి ఇవ్వడం ఆలస్యం.. సెట్స్ పైకి తీసుకొచ్చేస్తాడు. అయితే వెంకటేశ్ నారప్పతో.. వరుణ్ తేజ్ బాక్సింగ్ కాన్సెప్ట్ మూవీతో బిజీగా ఉన్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తయితేగానీ.. ఎఫ్ 3లో జాయిన్ కాలేరు. ఎఫ్ 2లోనటించిన హీరో హీరోయిన్లే ఇందులో నటిస్తారు. అయితే.. ఎఫ్ 3లో నటించే ఆ మూడో హీరో ఎవరో రివీల్ చేయలేదు. ఆ పాత్ర ఇంట్రెస్టింగ్ గా ఉంటుందన్నారు. ఈ లెక్కన మూడో హీరోగా స్టార్ నటించినా.. అది గెస్ట్ రోల్ మాత్రమే ఉంటుందేమో .

 

అనిల్ రావిపూడి లాక్ డౌన్ టైమ్ లో ఫ్యూచర్ ప్రాజెక్ట్ పై దృష్టి పెట్టాడు. బాలకృష్ణను డైరెక్ట్ చేయాలని చాలా కాలంగా వెయిట్ చేస్తున్నాడు. బాలకృష్ణ 100వ సినిమా కోసం కథ రాసుకున్నా ఆ ఛాన్స్ దక్కలేదు. ఎప్పటికైనా తీస్తానని బహిరంగంగానే చెప్పాను. బాలయ్యను డైరెక్ట్ చేసేది ఎప్పుడో చెప్పకపోయినా..ఆల్ రెడీ లైన్ రెడీగా ఉందన్నాడు దర్శకుడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: