టాలీవుడ్ లో మెగా హీరోలకు ఉండే క్రేజ్ గురించి అందరికి తెలిసిందే. వాళ్ళ తో సినిమా చేయడానికి ఎందరో దర్శక నిర్మాతలు ముందుకు వస్తు ఉంటారు. చిన్న చిన్న దర్షకుల నుంచి పెద్ద పెద్ద దర్శకుల వరకు సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తారు. ప్రస్తుతం సినిమా చేయడానికి మెగా హీరోలు చాలా దూకుడుగా ఆలోచన చేస్తున్నారు. అగ్ర హీరోల నుంచి మొన్నీ మధ్య సినిమాకు పరిచయం అయిన వాళ్ళు కూడా ఇప్పుడు దూకుడుగానే సినిమాలు చేస్తున్నారు అనేది వాస్తవం. ఇది పక్కన పెడితే మెగా హీరోల్లో ఒక హీరో మాత్రం చాలా రిచ్ అని అంటున్నారు దర్శకులు నిర్మాతలు. 

 

ఆయనే వరుణ్ తేజ్. వరుణ్ తో సినిమా చేయడం అనేది అంత ఈజీ కాదని టాలీవుడ్ జనం అంటున్నారు. ఆయన తో సినిమా అనగానే విదేశాల్లోనే ఎక్కువగా షూటింగ్ చెయ్యాలని సినిమా ఖర్చు వచిపోతుందని అనే భావన లో ఉన్నారట నిర్మాతలు. కథ లో ఎక్కువగా అమెరికా లేకపోతే ఇతర దేశాలు ఉండాలి అనే కోరిక ఆయనలో ఎక్కువగా ఉంటుందని దీనితో సినిమా చేసే వాళ్ళు ఇప్పుడు విదేశాల్లో షూటింగ్ అంటే భయపడుతున్నారని అందుకే ఆయన తో సినిమా చేసే ఆలోచన నుంచి బయటకు వస్తున్నారని అంటున్నారు. ప్రస్తుతం వరుణ్ మూడు సినిమాలు చేస్తునాడు. 

 

ఒక సినిమా సెట్స్ మీదకు వెళ్ళింది. ఇతర సినిమాలు సెట్స్ మీదకు వెళ్ళడానికి రెడీ గా ఉన్నాయి. ఇప్పుడు ఆ సినిమాలే ఆగిపోయాయి బడ్జెట్ కారణం గా అని అంటున్నారు. అతను నటించిన తొలి సినిమా నుంచి మొన్నీ మధ్య వచ్చిన సినిమా వరకు కార్ల అద్దె ఎక్కువగా ఉంటుంది అనే ఆవేదన కూడా ఉందని అంటున్నారు. అందుకే ఇప్పుడు సినిమాలు చేసే విషయంలో ఒకటికి పది సార్లు ఆలోచించే పరిస్థితి వచ్చిందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: