తెలంగాణలో గురువారం కొత్తగా మరో 22 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1038కు చేరింది. గత మూడు రోజులుగా కేవలం పది లోపలే పరిమితమైన కేసులు.. ఈరోజు డబుల్ డిజిట్‌లోకి రావడం గమనార్హం. కరోనా కారణంగా ఇప్పటివరకూ 28 మంది మృతి చెందగా.. 442 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 568 యాక్టివ్ కరోనా కేసులున్నాయి. దాదాపు 11 జిల్లాల్లో ఒక్క కరోనా యాక్టివ్ కేసు కూడా లేదు.

 

ఇకపోతే కేంద్ర ప్రభుత్వం కరోనా నివారణ చర్యలను సమర్థవంతంగా నిర్వహిస్తున్న తెలంగాణ ప్రభుత్వం పై ప్రశంసల వర్షం కురిసింది. పేషెంట్లకు అందుతున్న చికిత్స, అందిస్తున్న సౌకర్యాల పట్ల పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తూ ఢిల్లీ వేదికగా కేంద్ర ప్రభుత్వం ప్రశంసించడం సంతోషం అని వైద్యారోగ్య శాఖ మంత్రి మంత్రి ఈటల రాజేందర్ అన్నారు.

 

ఇక ఏపీ లో రోజు రోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గత వారం రోజులుగా పరిస్థితి మరీ దారుణంగా ఉంది. గత 24 గంటల్లో కొత్తగా మరో 71 పాజిటివ్ కేసులు నమోదైనట్లు గురువారం బులిటెన్‌లో ఆరోగ్య ఆంధ్ర ప్రకటించింది.

 

జిల్లాల వారీగా మొత్తం కేసుల వివరాలు ఇలా ఉన్నాయి.

కర్నూలు జిల్లా -386

గుంటూరు జిల్లా - 287

కృష్ణా జిల్లా - 246

నెల్లూరు జిల్లా -84

చిత్తూరు జిల్లా - 80

కడప జిల్లా -73

ప్రకాశం జిల్లా - 60

పశ్చిమ గోదావరి జిల్లా - 56

అనంతపురం జిల్లా -61

తూర్పుగోదావరి జిల్లా - 42

విశాఖపట్నం జిల్లా -23

శ్రీకాకుళం జిల్లా - 5

మొత్తం కేసులు -1403

 

డిశ్చార్జి అయిన వారు- 321

మరింత సమాచారం తెలుసుకోండి: