శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో 'నారప్ప' అన్న టైటిల్ తో వెంకటేష్ ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడమే కాదు ఇండస్ట్రీలో ఈ లుక్ హాట్ టాపిక్ కూడా అయింది. ఇక ఈ సినిమాను తమిళ సినిమా 'అసురన్’కు అఫీషియల్ రీమేక్‌గా సురేష్ బాబు నిర్మిస్తున్నారు. తమిళంలో ధనుష్ నటించిన ఈ కంప్లీట్ కల్ట్ కంటెంట్ తో తెరకెక్కి బ్లాక్ బస్టర్ హిట్ ని దక్కించుకుంది. అంతేకాదు ఇప్పటి వరకు ధనుష్ నటించిన సినిమాలలోనే హైయ్యెస్ట్ కలెక్షన్స్ ని రాబట్టిన సినిమాగా రికార్డ్ క్రియోట్ చేసింది. అయితే ఈ సినిమాని తెలుగులో తీయాలనుకున్నప్పుడు కొన్ని విమర్శలు వచ్చాయి.

 

అయినా విక్టరీ వెంకటేష్ తో పాటు ఆయన అన్నయ్య సురేష్ బాబు ధైర్యంగా ఈ సినిమాని చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ మొదలైన ఈ సినిమా లాక్ డౌన్ కారణంగా బ్రేక్ పడింది. ఇక ఈ సినిమా మీద వెంకీ చాలా నమ్మకంగా ఉన్నారు. అందుకు కారణం కోలీవుడ్ అలాగే బాలీవుడ్ లో సూపర్ హిట్టయిన సినిమాలని వెంకటేష్ రీమేక్ చేసి బ్లాక్ బస్టర్స్ ని అందుకున్నారు. వెంకటేష్ తో ఎక్కువగా రీమేక్ సినిమాలు చేసింది సూపర్ గుడ్ ఫిలింస్ తర్వాత సురేష్ ప్రొడక్షన్స్. రాజా, సూర్యవంశం, చంటి, శీను, వసంతం, మసాలా, బాడీగార్డ్, గోపాల గోపాల, గురు ... ఇలా వెంకీ నటించిన చాలా రీమేక్ సినిమాలు టాలీవుడ్ లో భారీ వసూళ్ళని సాధించాయి.

 

తమిళ వెర్షన్ కి వెట్రిమారన్ దర్శకత్వం వహించగా దాదాపు  రూ. 100 కోట్లకు పైగా వసూళ్ళు రాబట్టి సెన్షేషనల్ హిట్ గా నిలిచింది. అందుకే ఈ సినిమాని సురేష్ బాబు తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఇక తెలుగులో వెంకటేష్ కి జంటగా ప్రియమణి నటిస్తోంది. అయితే ఈ సినిమాని సమ్మర్ రిలీజ్ గా ప్లాన్ చేసుకున్నారు సురేష్ బాబు టీం. కాని ఇప్పుడది దాదాపు మూడు నెలలు పోస్ట్ పోన్ అవుతున్నట్టు తాజా సమాచారం. లాక్ డౌన్ ఎత్తేశాక పరిస్థితులను బట్టి ఈ సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయాలనుకుంటున్నారు.

 

అయితే అసలే రీమేక్ సినిమా ఇప్పుడున్న పరిస్థితుల్లో వెంకీ ముందు ఉన్నది పెద్ద సవాలే అంటున్నారట. కాని వెంకటేష్ మాత్రం అందుకు భిన్నంగా మాట్లాడుతున్నారట. సాధారణంగానే కొన్ని సార్లు సినిమాని అనుకున్న సమయానికి రిలీజ్ చేయలేకపోతాము. అంతమాత్రాన సినిమా మీద నెగిటివ్ కామెంట్స్ చేస్తే ఎలా ...సినిమా ని ఆదరించేది ప్రేక్షకులు. ఏదైనా వాళ్ళ నిర్ణయమే కదా ..ముందే ఎందుకు ఇలా నెగిటివ్ కామెంట్స్ చేయడం అని సున్నితంగా అన్నారట. అంటే దీన్ని బట్టి వెంకీ ఎం చెప్పారో అర్థమైంది కదా ..! 
 

మరింత సమాచారం తెలుసుకోండి: