మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటే ఫైట్లు, డ్యాన్సులు, కామెడీ ఉండాల్సిందే. సగటు తెలుగు సినీ ప్రేక్షకుడు చిరంజీవి నుంచి కోరుకునేది ఇవే. చిరంజీవి వయసు అరవైల్లో ఉన్నా ఆయన అభిమానులకు ఇవే కావాలి. చిరంజీవి కూడా ఇందుకు తగ్గట్టే సన్నద్ధమవుతూంటారు. ప్రస్తుతం ఆయన చేస్తున్న ఆచార్య కూడా ఇదే తరహాలో ఉంటుందని సమాచారం. దీనిపై దర్శకుడు కొరటాల శివ ఇటీవల ఓ ఆన్లైన్ వెబ్ మీడియాతో ఈ సినిమా ముచ్చట్లు పంచుకున్నారు. సినిమాపై అంచనాలు పెంచేస్తున్న కొరటాల వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.

 

 

‘సినిమాలో చిరంజీవి గారి పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుంది. విలన్లకు సింహస్వప్నంలా నిలిచే పాత్ర. చిరంజీవి గారికి భారీ డైలాగులు కూడా ఉంటాయి. చిరంజీవి గారి పాత్రకు ఫ్యాన్స్ నుంచి ఆడియన్స్ నుంచి మంచి రెస్సాన్స్ రావడం ఖాయం’ అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో సినిమాపై అంచానాలను ఒక్కసారిగా పెంచేశాడు కొరటాల శివ. మామూలుగానే చిరంజీవి సినిమా అంటే అభిమానుల్లో ఆనందానికి, అంచనాలకు అంతు ఉండదు. కొరటాల మాటలతో సినిమా కోసం ఫ్యాన్స్ మరీ ఎక్కువగా ఎదురు చూస్తారనడంలో సందేహం లేదు.

 

 

నిజానికి గత ఏడాది వచ్చిన సైరా.. నరసింహారెడ్డిని ఇవేమీ లేకుండానే హిట్ చేసారు ప్రేక్షకులు. దానికి కథ, చిరంజీవి పెర్ఫార్మెన్స్ డామినేట్ చేయడం వల్ల వర్కౌట్ అయింది. అయితే.. చిరంజీవి నుంచి ఇలాంటి ఫక్తు కమర్షియల్ మూవీనే కోరుకుంటారు. చిరంజీవి సంపాదించిన ఇమేజ్, సాధించిన క్రేజ్ అంతా కమర్షియల్ మూవీస్ తోనే. ఖైదీ నెంబర్ 150లో ఈ అంశాలు ఉన్నా అది డబ్బింగ్ మూవీగా నిలిచిపోయింది. చిరంజీవి మళ్లీ సినిమాలు చేయడం మొదలుపెట్టాక చేస్తున్న స్ట్రైట్ కమర్షియల్ మూవీ ఆచార్య. దీంతో ఈ సినిమాపై ఫ్యాన్స్, ఆడియన్స్ లో అంచనాలు భారీగా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: