2004లో వచ్చిన 7/జి బృందావన కాలనీ సినిమా అప్పటి యూత్ ఆడియెన్స్ కు బాగా గుర్తుండిపోయే సినిమా.. తెలుగు తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ సినిమా చూసిన తర్వాత ఒక వారం పాటు మనతో పాటే ప్రయాణం చేసేలా కథ, కథనాలు ఉంటాయి. తమిళ సెల్వ రాఘవన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో హీరోగా సూర్య మూవీస్ అధినేత వారసుడు రవి కృష్ణ హీరోగా సోనియా అగర్వాల్ హీరోయిన్ గా నటించిన సినిమా 7/జి బృందావన కాలనీ. 

 

ఇక ఈ సినిమా సూపర్ హిట్ తర్వాత మరో రెండు సినిమాల్లో సోనియాకు ఛాన్స్ ఇచ్చిన సెల్వ రాఘవన్ ఆమెనే పెళ్లాడటం జరిగింది. 2006లో వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు. అయితే వీరి ప్రేమ పెళ్లి ఎన్నాళ్ళో నిలవలేదు. 2009లోనే వీరిద్దరు డైవర్స్ తీసుకున్నారు. సోనియా అగర్వాల్ హీరోయిన్ గా మంచి హిట్ ట్రాక్ లో ఉన్న టైం లో సెల్వ రాఘవన్ తో మ్యారేజ్ అవడంతో ఆ తర్వాత అమ్మడి కెరియర్ పూర్తిగా ట్రాక్ తప్పింది. 

 

అఫైర్స్ తో ముగించకుండా పెళ్లి దాకా వెళ్లిన ఈ ఇద్దరి జోడీ ఆ పెళ్లి బంధాన్ని మాత్రం కొనసాగించలేకపోయారు. హీరోయిన్ గా సోనియా ట్రాక్ మిస్ అవగా.. డైరక్టర్ గా సెల్వ రాఘవన్ మంచి ఫామ్ లో ఉన్నాడు. డైరక్టర్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న సెల్వ రాఘవన్ సోనియాతో డైవర్స్ తీసుకున్నాక 2011 లో గీతాంజలి రామం ను పెళ్లాడారు. గీతాంజలి రామన్ కూడా సెల్వ రాఘవన్ దగ్గర అసిస్టెంట్ డైరక్టర్ గా పనిచేసింది. హీరో, హీరోయిన్స్  రియల్ లైఫ్ మ్యారేజ్ కామన్ కానీ డైరక్టర్స్ తో హీరోయిన్ ప్రేమాయణం, పెళ్లి లాంటివి కొద్దిగా కొత్తగా అనిపిస్తుంది. అయితే అలాంటి వారిలో సెల్వ రాఘవన్, సోనియా ఉంటారు. విడిపోయాక కూడా ఒకరిని ఒకరు దూషించుకోకుండా చాలా పద్ధతిగా వ్యవహరిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: