సినిమాల్లో కానీ.. రాజకీయాల్లో కానీ.. బుల్లితెరపై కానీ ఎక్కడైనా డేరింగ్ అండ్ డ్యాషింగ్ హీరోయిన్ ఆర్కే రోజా.. ఇప్పుడు ఎమ్మెల్యే.. రోజా గారు ప్రతిపక్ష నాయకులను తిట్టే పద్ధతి చూస్తే అనిపిస్తుంది.. వామ్మో అని.. కానీ అలాంటి డేరింగ్ లేడీకి కూడా సున్నితమైన మనసు ఉంది అని.. ఆమె కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్న ఒక సున్నితమైన మహిళ అని ఆమె గతంలోకి వెళ్తేనే తెలుస్తుంది. 

 

ఇకపోతే.. ప్రత్యర్థులకు వణుకు పుట్టించే రోజా అప్పట్లో ఓ వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అతనే ఆర్కే సెల్వమణి. ప్రముఖ దర్శకుడు అయినా సెల్వమణిని 2002లో ఆమె వివాహం చేసుకున్నారు.. సినిమా జీవితం.. వ్యక్తిగత జీవితం.. రాజకీయ జీవితం అన్ని కూడా అందంగా మార్చుకొని జీవిస్తున్నారు రోజా. 

 

అయితే గతంలో ఓ ఫంక్షన్ కు హాజరైన ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ.. తన వ్యక్తిగత జీవితం గురించి అందరితో పంచుకున్నారు.. భర్త సెల్వమణితో తన ప్రేమ ప్రయాణం భీమిలి నుండే మొదలైందని ఆ ఫంక్షన్ లో చెప్పారు. అంతేకాదు ఆమెకు భిమిలీతో ప్రత్యేకమైన అనుబంధం ఉంది అని.. భీమిలీ తనకు ఎంతో ప్రత్యేకమైన స్థలం అని ఆమె చెప్పారు. 

 

కాగా.. చామంతి సినిమా షూటింగ్ భీమిలి బీచ్‌లో జరిగింది.. దీంతో ఆమె భీమిలిలోనే ఏడాది పాటు ఉన్నట్టు తెలిపారు. తన సినిమా కెరీర్‌ కూడా ఇక్కడే మొదలయింది అని ఆమె భర్త సెల్వమణితో ప్రేమ పుట్టిన ప్రాంతం కూడా అదే అని ఆమె అప్పట్లో తెలిపారు. అయితే ఆ వీడియోలు ఈ లాక్ డౌన్ లో వైరల్ అవుతున్నాయి.. ఏది ఏమైనా ఓ ప్రత్యేకమైన విషయాన్నీ అప్పట్లోనే ప్రజలతో పంచుకున్నారు ఎమ్మెల్యే రోజా.                         

మరింత సమాచారం తెలుసుకోండి: