టాలీవుడ్ ని అటు తమిళ సినిమాను ఒక ఊపు ఊపిన హీరోయిన్ నయన తార. ఆమె సినిమా వస్తుంది అంటే చాలు స్టార్ హీరో సినిమా వస్తుంది అనే ఆసక్తి చూపిస్తూ ఉంటారు. టాలీవుడ్ లో కూడా ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఆమె సినిమాల కోసం ప్రేక్షకులు ఎంతో ఆశగా ఎదురు చూస్తు ఉంటారు. మన తెలుగులో అగ్ర హీరోలు అందరితో ఆమె సినిమాలు చేస్తూ వచ్చింది. ప్రతీ సినిమాలో కూడా ఆమె కీలక పాత్రలు హీరోయిన్ గా చేసింది అనే విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె తమిళ సినిమాకు మాత్రమే పరిమితం అయింది. 

 

ఇక ఇదిలా ఉంటే ఆమె ప్రేమ వ్యవహారాల్లో ప్రధానంగా చెప్పుకునేది దర్శకుడు ప్రభుదేవా తో ఆమె నడిపిన ప్రేమ వ్యవహారం. ఆయనకు పెళ్లి అయినా సరే ప్రేమించింది పెళ్లి చేసుకోవాలని అనుకుంది ఆయనతో కలిసి బ్రతకడానికి తనకు పేరు తెచ్చిన సినిమాను కూడా ఆమె పక్కన పెట్టింది అనేది వాస్తవం. ఆ తర్వాత ఆయన నుంచి విడిపోయి ఒంటరి జీవితాన్ని గడిపింది. మళ్ళీ ప్రేమలో పడింది ఆమె. శింభు తో ప్రేమ వ్యవహారం నడిపింది. ఈ ప్రేమ వ్యవహారం కూడా ఆమెకు అంతగా కలిసి రాలేదు. ఈ రెండు వ్యవహారాల్లో ఆర్ధికంగా బాగా నష్టపోయింది అనే టాక్ ఉంది. 

 

ఇక ఇప్పుడు ఆమె విజ్ఞేశ్ శివన్ తో ప్రేమ వ్యవహారం నుంచి దాదాపుగా బయటకు వచ్చింది అనే చెప్పాలి. అతని తో ప్రేమ వ్యవహారం నడిపిన ఆమె అతనితో కూడా విభేదాలు రావడం తో అతని నుంచి దూరం జరిగింది అనే చెప్పుకోవచ్చు. ఇలా ఆమె ప్రేమ వ్యవహారాలూ సీరియస్ గా నడిపిన ముగ్గురు కూడా దర్శకులే కావడం గమనార్హం. ఇలా తన కెరీర్ ని నాశనం చేసింది కూడా ఆ ముగ్గురే.

మరింత సమాచారం తెలుసుకోండి: