ప్రభుదేవాను మనసులో నుంచి పూర్తిగా తుడిచివేసినా ఓ జ్ఞాపకం మాత్రం నయనతారను వెంటాడింది. ఈ గుర్తును చూసినప్పుడల్లా మాజీ ప్రియుడు గుర్తుకురావడంతో లేటెస్ట్ గా.. ఆ జ్ఞాపకాన్ని కూడా తుడిచేసింది. నయన ప్రభుదేవాతో బ్రేకప్ తర్వాత నయన దర్శకుడు విఘ్నేష్ శివన్ ప్రేమలో విహరిస్తోంది. నయనతారను ఇబ్బంది పెట్టిన ప్రభుదేవా గుర్తు ఏమిటో తెలుసా.. 

 

నయనతార, ప్రభుదేవా ప్రేమకథ.. బ్రేకప్ గురించి అందరికీ తెలిసిందే. చెట్టాపట్టాలేసుకొని తిరిగిన సమయంలో.. ప్రభుదేవా పేరును చేతిపై పచ్చబొట్టుగా వేయించుకుంది నయన. పెళ్లి పీటలు దాకా వెళ్లిన వీళ్ల ప్రేమకు బ్రేకప్ పడింది. ప్రభుదేవాను మరిచిపోవడానికి వరుసగా సినిమాలు చేస్తూ బిజీ అయిపోయింది నయనతార. 

 

ప్రభుదేవాను మరిచిపోయి వరుస సినిమాలు చేస్తున్న టైమ్ లో నేను రౌడీనే సినిమా దర్శకుడు విఘ్నేష్ శివన్ ప్రమలో పడింది నయన. వీళ్ల ప్రేమకు ఐదేళ్లు నిండాయి కూడా. ఖాళీ దొరికినప్పుడల్లా ఫారిన్ టూర్ వేయడం.. పుట్టిన రోజు వేడుకను ఇద్దరూ కలిసి చేసుకోవడం ఆ ఫోటోలను పోస్ట్ చేయడం లాంటివి చేస్తూనే ఉన్నారు. అదిగో ఇదిగో పెళ్లి చేసుకుంటారన్న వార్తలేగానీ.. పెళ్లి వార్తను మాత్రం బయటపెట్టడం లేదు. 

 

ప్రభుదేవాను మనసు నుంచి డిలీట్ చేసినా.. మాజీ ప్రియుడి గుర్తులు మాత్రం నయనతారను వెంటాడుతున్నాయి. చేతిపై ఉన్న ప్రభుదేవా టాటూను చూసినప్పుడల్లా ఆ జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి కాబోలు.. ప్రభుదేవా పేరును చెరిపివేసి.. ఆ ప్లేస్ లో పాజిటివిటీ అనే టాటూతో కనిపిస్తోంది నయన. ఈ టాటూ స్టిల్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది నయన. ఒకసారి శింబుతో.. మరోసారి ప్రభుదేవాతో లవ్ ఫెయిల్ అయినా.. ప్రేమ పట్ల పాజిటివిటీ ఉంది కాబట్టి.. విఘ్నేష్ శివన్ ప్రేమలో పడింది. పాజిటివిటీ అనే సూత్రాన్ని నమ్ముకున్న నయన ఆ పదాన్నే టాటూగా వేయించుకుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: