తెలుగు తమిళంలో ఒక వెలుగు వెలిగిన హీరోయిన్ నయనతార. ఆమెకు హీరోలతో సమానం గా ఫాలోయింగ్ ఉంది. ఆమె ప్రేమ వ్యవహారాల మీద తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తి చూపిస్తూ ఉంటారు. తెలుగు ప్రేక్షకులకు ఆమె ఏ స్థాయిలో దగ్గర అయింది అనేది పక్కన పెడితే ఆమె తన ప్రేమ వ్యవహారాలతో మాత్రం బాగా దగ్గర అయింది అని గట్టిగా చెప్పవచ్చు. ఆమెకు ఉన్న క్రేజ్ ని చూసి చాలా మంది తెలుగు హీరోయిన్ లు ఇబ్బంది పడిన సందర్భాలు కూడా ఉన్నాయని అంటూ ఉంటారు. ఇక ఇది పక్కన పెడితే ఆమె పెళ్లి చేసుకోవాలి ప్రేమించాలి అనుకున్న వాళ్ళు అందరూ కూడా దర్శకులే. 

 

దీనికి కారణం ఏంటీ అనేది తెలియదు గాని ఇప్పుడు మళ్ళీ ఆమె కొత్త దర్శకుడి తో ప్రేమలో పడింది అని సమాచారం. ఒక యువ దర్శకుడ్ని ఆమె ప్రేమించారు అని సమాచారం. విజ్ఞేశ్ శివన్ తో బ్రేకప్ అయిన తర్వాత ఆమె అతనికి దగ్గర అయింది అనేది టాలీవుడ్ జనాల మాట. ఆమె విషయంలో అతను చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు అని ఎక్కడా కూడా హడావుడి లేకుండా పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉన్నారని టాలీవుడ్ లో తమిళంలో వార్తలు షికారు చేస్తున్నాయి. వీరు ఇద్దరూ విదేశాలకు వెళ్లి వివాహం చేసుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. 

 

అది ఎంత వరకు నిజం అనేది ఆమె చెప్తే తెలుస్తుంది. ప్రేమ వ్యవహారాలను ఆమె ఎప్పుడు కూడా బయటపెట్టి చెప్పుకున్న సందర్భం అంటూ ఏదీ లేదు. విజ్ఞేశ్ శివన్ ఆమెను ఒక సినిమా షూటింగ్ లో బాగా అవమానించాడు అని అందుకే అతనికి ఆమె చాలా వరకు దూరంగా ఉంది అని అంటారు. అతని ముందు ఆమె హీరో కి లిప్ లాక్ ఇవ్వడానికి బాగా ఇబ్బంది పడింది అని అప్పుడు ఆయన కొన్ని మాటలు అన్నాడట.

మరింత సమాచారం తెలుసుకోండి: