అంత సీన్ లేదులే అనుకుంటూ మళ్లీ రీ ప్లాన్ చేసుకుంటున్నారు. బాలీవుడ్ లో తెరంగేట్రం చేస్తున్న విజయ్ ఫైటర్ సినిమా మొన్నటి వరకూ ముంబైలోనే షూటింగ్ జరిగింది. కానీ ఇప్పుడప్పుడే ముంబై లో షూటింగ్స్ జరిగే పరిస్తితి కనిపించడంలేదని.. అదేదో హైదరాబాద్లోనే కానిచ్చేద్దామనుకుంటున్నాడట పూరీ. అసలే  సినిమాని పరుగులు పెట్టించే  ఈ డైరెక్టర్.. ఫైటర్ కోసం అంత టైమ్ ఎందుకు తీసుకుంటాడు.

 

కొరటాల చిరంజీవి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఆచార్య సినిమా కూడా రీ ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పటివరకూ ఓన్లీ హీరో పోర్‌షన్ మీదే షూటింగ్ చేసిన  కొరటాల బ్రేక్‌ తర్వాత హీరోయిన్ పార్ట్ కూడా కంప్లీట్ చేద్దామని ప్లాన్ చేసుకున్నారు. కానీ ఇప్పుడప్పుడే  హీరోయిన్ పార్ట్ ఎందుకులే... షూటింగ్ స్టార్ట్ అయ్యాక ఫస్ట్.. చిరంజీవి పోర్‌సన్ మొత్తం కంప్లీట్ చేసేద్దాం అని డిసైడ్ అయ్యారట కొరటాల అండ్ టీమ్.

 

పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా కూడా రీ ప్లాన్ చేస్తున్నారు. ఇంకా 18 రోజుల షూటింగ్ ఉంది. దాంతో పాటు పవన్ కళ్యాణ్‌ కి ఫ్లాష్ బ్యాక్ లో లవ్ ట్రాక్ కూడా ప్లాన్ చేసుకున్నాడట డైరెక్టర్ వేణు. కానీ ఇప్పుడు అంత టైమ్ లేదని.. ఆ పోర్‌షన్ ట్రిమ్ చేసి 7 ఎకరాలలో వేసిన సెట్ లోనే మిగిలిన షూటింగ్ కంప్లీట్ చేద్దామని ఆలోచిస్తున్నారు మేకర్స్.

 

రెబల్ స్టార్ ప్రస్తుతం రాధాకష్ణ తో చేస్తున్న జాన్ సినిమా జార్జియాలో షూటింగ్ కోసం వెళ్లింది. కరోనా ఎఫెక్ట్ తో షూటింగ్ కంప్లీట్ అవ్వకముందే రిటర్న్ అయ్యింది. మళ్లీ ఇప్పుడప్పుడే జార్జియా వెళ్లే పరిస్తితి కనిపించకపోవడంతో మళ్లీ అంతదూరం ఎందుకు..? ఇక్కడే సెట్లతో పనికానిచ్చేద్దాం అనుకుంటూ రామోజీ ఫిల్మ్ సిటీ, అన్నపూర్ణ స్టూడియోల్లోనే సెట్లు డిజైన్ చేసుకుందామని డిసైడ్ అయ్యారట ప్రభాస్ అండ్ యూనిట్. 

మరింత సమాచారం తెలుసుకోండి: