సినిమా స్టార్ట్ చేసే ముందే రిలీజ్ డేట్ అనౌన్స్ చేసే హాలీవుడ్ హీరోలు సినిమాలు డిలే అవ్వడంతో డల్ అవుతున్నారు. లాక్ డౌన్ ఎఫెక్ట్ తో  థియేటర్లు , షూటింగులు బంద్ అయిపోయాయి. వందల కోట్ల నష్టపోతోంది సినిమా ఇండస్ట్రీ. హాలీవుడ్ హ్యాడ్సమ్ హీరో అయితే తన సినిమా రిలీజ్ అయ్యే టైమ్ కి షష్టిపూర్తి చేసుకునేలా ఉన్నాడు .

 

1996 లో స్టార్ట్ అయిన ఈ మిషన్ ఇంపాజిబుల్ సిరీస్ ను దాదాపు 25 ఏళ్లుగా సూపర్ హిట్ చేస్తూ.. స్టార్ హీరో గా విపరీతమైన క్రేజ్‌ సంపాదించుకున్నాడు టామ్ క్రూజ్ . హాలీవుడ్ మోస్ట్‌ హ్యాండ్సమ్ హీరోగా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఈ 57 ఏళ్ల టామ్ క్రూజ్ కి. ఈ మిషన్ ఇంపాజిబుల్ హీరో ఇప్పుడు తన సిరీస్ లోని 7, 8  సినిమాలన్నీ పోస్ట్ పోన్ అవ్వడంతో విచిత్రమైన పరిస్తితిని ఎదుర్కొంటున్నాడు.

 

మిషన్ ఇంపాజిబుల్ ఫ్రాంచైజ్ లో వచ్చిన అన్ని సినిమా లు సూపర్ హిట్ అయ్యాయి. స్పెషల్లీ 5, 6 సిరీస్ లు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. అందుకే మళ్లీ మిషన్ ఇంపాజిబుల్ సిరీస్ లో 7, 8 సినిమాల్ని బ్యాక్ టూ బ్యాక్ తెరకెక్కిద్దామని ప్లాన్ చేసుకున్నాడు డైరెక్టర్ క్రిస్టోఫర్ మెక్ క్వారీ. టామ్ క్రూజ్ హీరోగా వస్తున్న మిషన్ ఇంపాజిబుల్ 7, 2021 జూన్ 23 న రిలీజ్ అవ్వాల్సి ఉంది. కానీ ఈ కరోనా ఎఫెక్ట్ తో సినిమాని నవంబర్ 19, 2021 కి పోస్ట్ పోన్ చేశారు.

 

మిషన్ ఇంపాజిబుల్ 8 ను 2022 ఆగస్ట్ 5 న రిలీజ్ చెయ్యాలనుకున్నారు కానీ .. నవంబర్ 4.. 2022 కు పోస్ట్ పోన్ చెయ్యాల్సి వచ్చింది. అంటే ఈ సూపర్ హీరో మిషన్ ఇంపాజిబుల్ 8 రిలీజ్ టైమ్ కి 60 ఏళ్ల వయసుకు వచ్చేస్తాడు. ఈ విషయం విని ఆశ్చర్యపోతున్నవాళ్లు కొంతమందైతే .. అయ్యో అప్పుడే మా హ్యాండ్సమ్ హీరోకి 60 ఏళ్లు వచ్చేశాయా అని బాధపడుతున్నారు కొంతమంది. ఇలా మిషన్ ఇంపాజిబుల్  సిరీస్ లో 8వ సినిమా వచ్చేసరికి టామ్ క్రూజ్ ఏకంగా షష్టిపూర్తి వయసుకి వచ్చేస్తాడు .  

మరింత సమాచారం తెలుసుకోండి: