ప్రముఖ కొరియోగ్రాఫర్, హీరో, దర్శకుడు రాఘవ లారెన్స్ ఇతరులకు సాయం చేయడంలో ఎప్పుడూ ముందుంటారు. కరోనా వైరస్ కారణంగా ఉపాధి కోల్పోయి ఇబ్బంది పడుతోన్న సినీ కార్మికులు, పేదలు, సినీ నృత్యకళాకారులను ఆదుకోవడానికి ఇప్పటికే రూ.3 కోట్ల విరాళం ప్రకటించారు. ఈ రూ.3 కోట్లలో పీఎం కేర్స్ ఫండ్, తమిళనాడు సీఎం రిలీఫ్ ఫండ్, ఎఫ్ఈఎఫ్ఎస్‌ఐ యూనియన్, డాన్సర్స్ యూనిన్లకు రూ.50 లక్షల చొప్పున.. దివ్యాంగులకు రూ.25 లక్షలు, తన స్వస్థలం చెన్నైలోని రోయపురంలోని పేద ప్రజల కోసం రూ.75 లక్షల సాయం అందజేస్తున్నట్టు లారెన్స్ స్పష్టం చేశారు. ఇటీవల తమిళ్ న్యూ ఇయర్ సందర్భంగా 15లక్షల వరకు శానిటేషన్ వర్కర్స్ కోసం అందజేశారు. లారెన్స్ ప్రకటించిన మొత్తాన్ని ప్రస్తుతం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. పేద, దివ్యాంగ నృత్య కళాకారులకు ఆర్థిక సహాయాన్ని అందించారు. ఒక్కొక్కరికీ రూ. 25,000 చొప్పున హైదరాబాద్‌లో 10 మందికి, చెన్నైలో 13 మందికి మొత్తం 23 మందికి 5 లక్షల 75 వేల రూపాయలు లారెన్స్ డైరెక్ట్‌గా వారి అకౌంట్లో వేశారు. దివ్యాంగులైన డ్యాన్సర్లను లారెన్స్ మొదటి నుంచీ ప్రోత్సహిస్తోన్న సంగతి తెలిసిందే. తన సినిమాల్లోని ఒక పాటలో కచ్చితంగా దివ్యాంగ డ్యాన్సర్లను చూపిస్తూ ఉంటారు. తన ఛారిటీ నుంచి వాళ్లకు సాయం అందిస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ కరోనా కష్టకాలంలో తనను నమ్ముకున్నవారు ఎలాంటి ఇబ్బంది పడకూడదని ఈ ఆర్థిక సాయం అందిస్తున్నారు. తను సంపాదించిన దాంట్లో ఎక్కువ భాగం సమాజసేవకే ఉపయోగిస్తుంటారు. అంతటితో ఆపకుండా మరిన్ని మంచి పనుల్లో సాయం అందిస్తున్నాడు.

 

ఈ నేపథ్యంలో తన సాయాన్ని ఇంకా విస్తరించడానికి సంకల్పించాడు. ఈ క్రమంలో ఒక లెటర్ రిలీజ్ చేసాడు. ఈ లెటర్ ద్వారా సూపర్ స్టార్ రజినీకాంత్ కి కృతఙ్ఞతలు తెలియజేసాడు. డబ్బులు డొనేట్ చేస్తున్నప్పటికీ ఇంకా చాలా మంది తిండి కోసం అలమటిస్తున్నారు. వారు డబ్బులు కోరుకోవడం లేదు. తిండి కోరుకుంటున్నారు. అందుకే వారికి ఫుడ్ సప్లై చేయాలని డిసైడ్ అయ్యాను. దీనికి నేను ఒక్కడినే సరిపోను. అందుకే ఈ ఐడియా తలైవార్ సూపర్ స్టార్ రజినీకాంత్ కి చెప్పాను. ఆయన నా ప్రయత్నాన్ని అభినందించి 100 రైస్ బ్యాగ్ లను పంపించాడు. అందుకు ఆయనకు నా హృదయ పూర్వక కృతజ్ఞతలు అని తెలిపాడు. దీని కోసం సహాయం చేయమని కమల్ సర్, విజయ్ సర్, అజిత్ సర్, సూర్య సర్ లతో పాటు అందరూ సెలబ్రెటీలను రాజకీయనాయకులను కోరుకుంటున్నాను. సేఫ్టీ మెజర్స్ తీసుకుని మావాళ్లు వచ్చి వాటిని కలెక్ట్ చేసుకుంటారు. లాస్ట్ ఇయర్ నేను ఏర్పాటు చేసిన 'థాయ్' అనే ఓల్డ్ ఏజ్ హోమ్ పేరుతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాను. మీరు సాయం చేయాలనుకుంటే ఈ అడ్రెస్ కి లేదా ఫోన్ నంబర్ కి కాల్ చేయండి అంటూ డిటైల్స్ లెటర్ ద్వారా తెలియజేసాడు. ఇక సినిమాల విషయానికొస్తే లారెన్స్ అక్షయ్ కుమార్ తో 'కాంచన' సినిమాకు రీమేక్ గా 'లక్ష్మీ బాంబ్' చేస్తున్నాడు. అంతేకాకుండా సూపర్ స్టార్ రజినీకాంత్ ‘చంద్రముఖి’కి సీక్వెల్‌గా వస్తోన్న ‘చంద్రముఖి 2’లో తాను నటిస్తున్నట్టు ప్రకటించాడు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: