భారత సినీ పరిశ్రమలో అత్యంత అందాలతారగా పేరొందిన శ్రీదేవి ప్రముఖ ఫిలిం మేకర్ అయిన బోనీ కపూర్ ను వివాహమాడింది. బోనీకపూర్ 1975-77 లలో శ్రీదేవిని మొట్టమొదటిగా చూశాడట. ఆ తర్వాత ఆమె పై మనసు పరేసుకున్నాడు. ఆమెను తన సినిమాల్లో ఎలాగైనా నటింపజేయాలని అనుకున్నాడు. వెంటనే చక్కగా తయారయ్యి ఆగమేఘాలపై బయల్దేరి చెన్నైలోని శ్రీదేవి ఇంటికి చేరుకున్నాడు. కానీ ఆ సమయంలో శ్రీదేవి సింగపూర్ నగరంలో ఒక చిత్ర షూటింగ్ కొరకై బస చేస్తున్నారు. దాంతో ఆమెను కలుసుకోలేదని అతను తీవ్ర నిరాశ పడ్డాడు. కానీ ఆమెను మర్చిపోలేక ఆమె నటించిన ప్రతి ఒక్క సినిమాని మళ్ళీ మళ్ళీ చూసేవారట.


శేఖర్ కపూర్ 'మిస్టర్ ఇండియా' సినిమాలో కథానాయకి పాత్ర కోసం బోనీకపూర్ శ్రీదేవి ని మొట్టమొదటిగా కలిశాడు. ఆమెను కలవగానే ఎన్నాల్టికి నా కల నిజమైందని ఎంతో సంతోష పడుతూ ఆలోచనల్లో మునిగి పోయాడట బోనీకపూర్. వాస్తవానికి శ్రీదేవి కొత్తవారితో అంతగా మాట్లాడడానికి ఇష్టపడదు. ఆ సమయంలో బోనీ కపూర్ ఆమెకు అపరిచితుడే. దాంతో ఆమె బోనీకపూర్ తో హిందీ, ఇంగ్లీష్ భాషల్లో నాలుగు ముక్కలు మాట్లాడి నిశ్శబ్దంగా ఉండిపోయింది. మొదటి పరిచయంలోనే ఆమెపై ఎంతో ఆసక్తి కలిగిన బోనీకపూర్ ఆమె గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకున్నాడు.


శ్రీదేవి తల్లి తన కూతురు సినీ రెమ్యూనరేషన్ గురించి మాట్లాడేవారు. శ్రీదేవి అప్పటికే అగ్రతారగా కొనసాగుతూ సినిమాకి ఎనిమిదిన్నర లక్షల రూపాయల పారితోషకం అందుకుంటుంది. బోనికపూర్ చెన్నై వెళ్ళినప్పుడు శ్రీదేవి తల్లి అతనితో మాట్లాడుతూ... మా అమ్మాయి మీ సినిమాలో నటించాలంటే రూ.10 లక్షల రెమ్యూనరేషన్ ఇవ్వాలి' అని తేల్చి చెప్పేసింది. దాంతో ఒక్కసారిగా షాకైన బోనీకపూర్... మరీ, 10 లక్షలు ఏంటండీ? 11 లక్షలైతే ఇవ్వగలను అంతకంటే ఒక్క రూపాయి కూడా ఎక్కువ ఇవ్వలేను' అని గట్టిగా చెప్పాడట. అది వినే సరికి ఒక్కసారిగా నోరెళ్లబెట్టిన శ్రీదేవి తల్లి... ఇతనికి పిచ్చా? చెవుడా? అనుకుందట.


ఆ తరువాత వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. మిస్టర్ ఇండియా సినీ చిత్రీకరణ ప్రారంభమైన తరువాత శ్రీ దేవి ని ఇంప్రెస్ చేసేందుకు బోనీ కపూర్ శతవిధాల ప్రయత్నించాడు. ఉత్తమమైన మేకప్ కిట్స్, వస్త్రాలను ఆమెకోసం తెచ్చేవాడు. ఎప్పుడైతే శ్రీదేవి తండ్రి చనిపోయారో ఆ రోజు నుండి బోనీ కపూర్ వారి కుటుంబానికి ఆర్థికంగా ఎమోషనల్ గా అన్ని విధాలా అండగా నిలబడ్డారు. ఆ సందర్భంలోనే బోనికపూర్ పై శ్రీదేవి కి ఇష్టం కలిగింది. ఆ తర్వాత పరస్పర ఇష్టంతో ఇద్దరూ కలిసి 1996లో పెళ్లి చేసుకున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: