టాలీవుడ్ ఒక రేంజ్ లో ఒక వెలుగు వెలిగిన హీరోయిన్ రమ్యకృష్ణ. ఆమె చేసిన పాత్రలు ఆమె చేసిన సినిమాలు అన్నీ కూడా పూర్తి భిన్నంగా ఉంటూ ఉంటాయి అనేది అందరికి తెలిసిన విషయమే. నరసింహ సినిమాతో ఆమె తమిళ సినిమాకు ఎంత దగ్గరైంది అనేది పక్కన పెడితే తెలుగు ప్రేక్షకులకు మాత్రం ఆమె బాగా దగ్గరైంది అనేది వాస్తవం. టాలీవుడ్ లో ఆమెకు అక్కడి నుంచి మంచి ఆఫర్లు వచ్చేసాయి కూడా. ఇక కెరీర్ లో వెనక్కు తిరిగి చూసుకునే అవసరం దాదాపుగా రమ్యకృష్ణ కు రాలేదు అనేది వాస్తవం. కెరీర్ లో ఆమెకు ఆ సినిమా మంచి హిట్ ఇచ్చింది. 

 

ఇక అది పక్కన పెడితే ఆమె తెలుగులో ఎన్నో సినిమాలు చేసిన దర్శకుడు కృష్ణ వంశీ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అప్పట్లో వారి మధ్య ఎం ఉందో చాలా మందికి కనీసం తెలిసేది కాదు. ఆయనకు ఆమె ఎలా దగ్గరైంది అంటూ అందం గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉండే వారు. అయితే కుటుంబ సమస్యలు వచ్చిన సమయంలో ఆమెకు అతను అండగా నిలబడ్డాడు అని అంటూ ఉంటారు. కుటుంబం నుంచి రమ్యకృష్ణ ఒకానొక సమయంలో బయటకు వచ్చే య్య్యాలి అనే ఆలోచన చేసిందని అప్పుడు ఆయన నుంచి ఆమెకు పూర్తి మద్దతు దొరికింది అని చెప్తారు. 

 

ఒకానొక సమయంలో సినిమాలకు దూరం కావాలని భావించినా ఆయన ఆమెకు సర్ది చెప్పి సినిమాల్లో ఉండే విధంగా చేసాడు అని టాలీవుడ్ వర్గాలు తమిళ సినిమా వర్గాలు అంటూ ఉంటాయి. ఆమె కెరీర్ లో అతను చాలా కీలకమని అందుకే ఆమె ఆయన్ను ప్రేమించి పెళ్లి చేసుకుని ఉండవచ్చు అని టాలీవుడ్ వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆమె కెరీర్ కి అతను మూల స్థంభం అని అంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: