వల్లవన్( తెలుగులో వల్లభ) సినిమా చిత్రీకరణలో శింబు నయనతారల మధ్య ప్రేమ చిగురించింది. ఆ సినిమాలో కలిసి నటించడం ప్రారంభించిన వారిద్దరూ పబ్లిక్ ప్రదేశాలలో ఎన్నోసార్లు కనిపించారు. అయినా నయనతార శింబు మధ్య ఏదో జరుగుతుందని ఎవరూ ఊహించలేదు. వల్లభా నా వల్లభా కొంచెం మెల్లగా ఎద గిల్లవా అనే శృంగారభరితమైన పాట ఎంత హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీళ్ళిద్దరి మధ్య రొమాన్స్ వెండితెరపైనే కాదు నిజ జీవితంలో కూడా అంతే ఘాటుగా కొనసాగింది. సినీ ఇండస్ట్రీలో ఎఫైర్స్ పెట్టుకోవడం, బ్రేక్ అప్స్ చెప్పుకోవడం అనేది సర్వసాధారణం. శింబు నయనతార విషయంలో కూడా అదే జరిగింది. వారు విడిపోయే ముందే వాళ్ళిద్దరు ఏకాంతంగా కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.


శింబు నయనతారకి లిప్ టు లిప్ కిస్ ఇస్తున్న ఫోటో అప్పట్లో తెలుగు, తమిళ ఇండస్ట్రీలలో పెద్ద దుమారమే రేపింది. వారిద్దరికి మధ్య ఎఫైర్ ఉందని తెలిసి అందరూ ఆశ్చర్యపోయారు. ఈ ఫోటో లీక్ అవ్వడం వల్లనే వాళ్ళిద్దరూ విడిపోయారని విశ్వసనీయ వర్గాల నుండి అప్పట్లో వార్తలు గుప్పుమన్నాయి. శింబు నే కావాలని ఆ ఫొటోస్ ని సామాజిక మాధ్యమాలలో లీక్ చేసి ఫిలిం ఇండస్ట్రీలో కాంట్రవర్సి నెలకొల్పాడని కొంత మంది చెబుతుంటారు. అదేంటో అర్థం కాదు కానీ శింబు కి కాంట్రవర్సీలు సృష్టించడం అంటే చాలా ఇష్టం.


ఇకపోతే వీరిద్దరు బ్రేకప్ కావడానికి అసలైన కారణం మరొకటని కొంత మంది చెబుతుంటారు. ఒకానొక సమయం లో ఒక హోటల్లో శింబు బస చేస్తుండగా... అతడిని సర్ప్రైజ్ చేద్దామని నయనతార ఆ హోటల్ కి వెళ్లిందట. అయితే అతని రూములోకి ఆమె ప్రవేశించేసరికి అక్కడ శింబు ఒక అమ్మాయితో సరసాలాడుతూ కనిపించాడట. దాంతో తీవ్ర ఆగ్రహానికి గురైన నయనతార వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయిందట. ఆ రోజు నుంచి వారి రిలేషన్ షిప్ చెడుతూ వచ్చిందట. శింబు మోసాన్ని భరించలేని నయనతార రెండుసార్లు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. అదృష్టవశాత్తు ఆమె ఆ రెండు సార్లు రక్షించబడింది. శింబు లీకైన ఫోటోల గురించి ఒకనొక సందర్భంలో తెలియజేశాడు. ఆ ఫోటోలు దుబాయిలో తీసినవని, అవి లీకైన సమయంలో తనకి నయనతార కు బాగా గొడవలు అవుతున్నాయని తెలిపాడు. ఏదేమైనా ప్రస్తుతం నయనతార విగ్నేశ్ అనే ఓ డైరెక్టర్ తో హెల్త్తి రిలేషన్ షిప్ లో ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: