పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఛాన్స్ వస్తే డైరక్టర్స్ గా సూపర్ క్రేజ్ తెచ్చినట్టే.. పవన్ తో సినిమా చేయాలంటే స్టార్ డైరక్టర్ అవ్వాల్సిన పనిలేదు. పవన్ ఛాన్స్ వస్తే ఆ సినిమాతో హిట్ అందుకుంటే చాలు తెలుగు దర్శకుల స్టార్ లిస్ట్ లో ప్లేస్ దక్కించుకున్నట్టే. ఇక పవన్ తో ఒక సినిమా ఛాన్స్ వస్తేనే సూపర్ అనిపించుకుంటే సెకండ్ సినిమా ఛాన్స్ కూడా కొట్టేశారు. పూరి నుండి డాలీ వరకు పవన్ తో రెండు సినిమాలు చేసిన దర్శకులు ఉన్నారు. సుస్వాగతం సినిమాతో భీమనేని హిట్ ఇవ్వగా ఆ తర్వాత అన్నవరం ప్లాప్ అందించాడు. పవన్ కు హిట్ ఇచ్చిన పూరి సెకండ్ మూవీ కెమెరా గంగతో రాంబాబు సినిమాతో అంచనాలు అందుకోలేదు. 

 

ఇక ఎస్.జె సూర్య కూడా ఖుషీతో సూపర్ హిట్ ఇవ్వగా సెకండ్ ఛాన్స్ అందుకున్న పులి డిజాస్టర్ అందించాడు. ఇక కిషోర్ కుమార్ అలియాస్ డాలి మొదటి సినిమా గోపాల గోపాల హిట్ అందుకోగా రెండో ఛాన్స్ గా తీసిన కాటమరాయుడుతో నిరాశపరిచాడు. మొదటి సినిమా పవన్ కు హిట్ ఇచ్చిన డైరక్టర్స్ సెకండ్ సినిమా నిరాశరచారు. ఆ లిస్ట్ లో కరుణాకరన్ కూడా ఉన్నాడు. తొలిప్రేమ హిట్ తో దుమ్ముదులిపేసిన కరుణాకరన్ సెకండ్ మూవీ బాలుతో అంచనాలను అందుకోలేదు. 

 

ఐతే ఈ లిస్ట్ లో ఉన్న త్రివిక్రమ్ మాత్రం మొదటి సినిమా జల్సా యావరేజ్ అనిపించుకోగా.. సెకండ్ మూవీ అత్తారింటికి దారేది మాత్రం సెన్సేషనల్ హిట్ అందించాడు. ఇక ఆ తర్వాత వచ్చిన అజ్ఞాతవాసి మాత్రం మళ్ళీ నిరాశపరిచింది. గబ్బర్ సింగ్ తో పవన్ కు అదిరిపోయే హిట్ ఇచ్చిన హరీష్ శంకర్ పవర్ స్టార్ తో సెకండ్ ఛాన్స్ అందుకున్నాడు. మరి హరీష్ శంక పవన్ తో చేస్తున్న సెకండ్ మూవీ ఎలా ఉంటుందో చూడాలి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: