సుహాసిని... మన తెలుగులో ఆమెకు ప్రత్యేకమిన ఆదరణ ఉంది. హీరోయిన్ గా ఆమె చేసిన సినిమాలు అన్నీ కూడా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాయి, ఇంట్లో అమ్మాయిగా ఉంటుంది సుహాసిని అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఆమె కెరీర్ లో ఎన్ని సినిమాలు చేసినా సరే ఆమె మాత్రం ప్రేక్షకులకు ఒక హీరోయిన్ గా ఎప్పుడు కనపడలేదు అనే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఇక ఇది పక్కన పెడితే ఆమె మణిరత్నం ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆయన జీవితంలో ఆమె చాలా కీలకం అయ్యారు. అసలు అంతటి స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన ఆమె ఎందుకు పెళ్లి చేసుకుంది ఆయన్ను అనేది చాలా మందికి అర్ధం కాలేదు. 

 

ఆమె అసలు ఆయన్ను పెళ్లి చేసుకోవడానికి ప్రధాన కారణం ఏంటీ అనేది స్పష్టంగా తెలియదు గాని ఆమెకు అతను కొన్ని కొన్ని విషయాల్లో చాలా అండగా నిలబడ్డాడు అని చెప్తారు. ఆమెకు సినిమా పరిశ్రమలో చాలా వరకు ఒకప్పుడు ఆర్ధిక ఇబ్బందులు వచ్చాయని అందులో ఆయన కీలకంగా వ్యవహరించారని కొందరు సినిమాలు చేయించుకుని డబ్బులు ఇవ్వలేదు అని అప్పుడు ఆయన జోక్యం తో కొందరు డబ్బులు తిరిగి ఇచ్చారని అందుకే ఆమె ఆయనకు దగ్గర అయింది అని చెప్తూ ఉంటారు. ఇది ఎంత వరకు నిజం అనేది ఆమెకు ఒక్కరికే తెలియాలి. 

 

ఇక ఈ బంధం ముందు బాగా ఇబ్బంది పడింది అని విడి పోయే వరకు వెళ్ళినా సరే వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుని ఆ తర్వాత దగ్గర అయ్యారని ఏ ఇబ్బంది లేకుండా ఇప్పుడు కలిసి ఉంటున్నారు అని చెప్తున్నారు. ప్రస్తుతం ఆమె సినిమాలకు కాస్త దూరంగా ఉన్నా మంచి పాత్రలు వస్తే చేసుకోవడానికి రెడీ అయ్యారు. ఆమె సినిమాలకు మంచి ఆదరణ కూడా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: