ఇండియన్ సినిమాలో లేడీ సూపర్ స్టార్ గా ఒక వెలుగు వెలిగిన హీరోయిన్ శ్రీదేవి. ఆమె  సినిమా అనగానే అగ్ర హీరో నుంచి కింది స్థాయి ప్రేక్షకుడు వరకు అందరూ కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. కెరీర్ లో ఎందరో స్టార్ హీరోలతో ఆమె కలిసి పని చేసారు. ఎందరో స్టార్ హీరోల సినిమాలకు ఆమె ఆయువు పట్టు అయ్యారు అనేది వాస్తవం ఆమె తో సినిమా చేయడానికి గానూ ఎందరో దర్శక నిర్మాతలు ఆమె ఇంటి ముందు క్యూ కట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి అనేది ఎవరూ కాదు అనలేని వాస్తవం. 

 

టాలీవుడ్ లో ఆమె సినిమా వస్తుంది అంటే చాలు ప్రేక్షకులు పనులు మానుకుని చూసిన సందర్భాలు ఉన్నాయి అనేది వాస్తవం. బాలీవుడ్ లో అయినా టాలీవుడ్ లో అయిన యెక్కడ అయినా సరే ఆమె సినిమాకు ఒక క్రేజ్ ఉంటుంది. అలాంటి శ్రీదేవి బోణీ కపూర్ ని పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వడం ఒక సంచలనం. ఆయనకు అప్పటికే పెళ్లి అయినా సరే వీరు ఇద్దరు పెళ్లి చేసుకోవడం చూసి ఇండియన్ సినిమా మొత్తం అపుడు షాక్ అయింది అనేది వాస్తవం. ఆమెకు ఉన్న క్రేజ్ కి అనవసరంగా తప్పు చేసింది అనే ఆరోపణలు ఆమె మీద నేరుగా చేసారు 

 

అయితే ఆమె అతన్ని ఎందుకు పెళ్లి చేసుకుంది అనేది స్పష్టమైన కారణం తెలియకపోయినా సరే ఆమె కుటుంబానికి బాగా దూరమైంది అని ఈ సమయంలోనే కపూర్ కుటుంబం ఆమెకు పూర్తిగా అండగా నిలబడింది అని అందుకే ఆయన్ను పెళ్లి చేసుకుంది అని చెప్తూ ఉంటారు. అందుకే ఆయన్ను ఆమె పెళ్లి చేసుకుంది అని సమాచారం. అంతకు ముందు ఆమె పెళ్లి చేసుకోవాలి అనుకున్న వ్యక్తి ఆమెను మోసం చేయడం కూడా జరిగిందట.

మరింత సమాచారం తెలుసుకోండి: