టాలీవుడ్ జనాలకు ఇప్పుడు ఒక మంచి సినిమా కావాలి. కథ బాగుండే సినిమా ఇంట్లో ఉండి చూసే సినిమా కావాల్సి ఉంది. అగ్ర హీరోల సినిమాలు ప్రేక్షకుల ముందుకి వచ్చే అవకాశాలు లేవు. చిన్న హీరోల సినిమాలు అయినా ఏదోక రూపంలో విడుదల చెయ్యాలి అని చూస్తున్నారు. ఇందుకు గానూ ఇప్పుడు రెండు మూడు సినిమాలకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. అమెజాన్ ప్రైమ్ లో ఒక సినిమాను విడుదల చేసేందుకు గానూ నిర్మాతలు ట్రై చేస్తున్నారు. చిన్న హీరోలను మర్చిపోయే అవకాశం ఉంది కాబట్టి ఎడిటింగ్ పనులు పూర్తి చేసి విడుదల చెయ్యాలి అని చూస్తున్నారట. 

 

త్వరలోనే ఒక చిన్న సినిమాను విడుదల చేయడానికి కసరత్తులు చేస్తున్నారు. రాం హీరో గా వచ్చే రెడ్ సినిమాను విడుదల చేస్తారని అంటున్నారు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను విడుదల చేయడానికి గానూ అమెజాన్ ప్రైమ్ లేదా హాట్ స్టార్ తో చర్చలు కూడా జరిగాయని టాక్. అయితే హాట్ స్టార్ ఎక్కువ ఇవ్వడం లేదని అమెజాన్ ప్రైమ్ మాత్రం భారీగా ఆఫర్ చేసింది అని సమాచారం. ఈ సినిమాను ఏప్రిల్ 9 న విడుదల చేసే అవకాశం ఉంది. కాని లాక్ డౌన్ కారణంగా అది వాయిదా పడింది. 

 

ఇప్పుడు దాన్ని ఓటీటీ ఫ్లాట్ ఫాం లో విడుదల చేయడానికి గానూ గట్టిగానే ట్రై చేస్తున్నారు అనుష్క నటించిన నిశ్శబ్దం సినిమాను కూడా అందు లో విడుదల చేసే సూచనలు ఉన్నాయని అంటున్నారు. దీనిపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అలాగే మరి కొన్ని సినిమా లు కూడా విడుదల చేసే సూచనలు కనపడుతున్నాయి. మరి ఏ సినిమాను ముందు విడుదల చేస్తారా అనేది చూడాలి. మరి నిర్మాతల ఆలోచన ఏంటీ అనేది స్పష్టంగా తెలియదు. ఏదేమైనా క‌రోనా దెబ్బ‌తో సినిమా రంగంలో రిలీజ్‌ల వ్య‌వ‌స్థ‌లే మారిపోతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: