టాలీవుడ్ లో మార్కెట్ పెరగడం బాలీవుడ్ లో కూడా మన తెలుగు మీద ఆసక్తి పెరగడం తో మన హీరోలు మార్కెట్ పెంచుకునే ప్రయత్నాలు ఎక్కువగా చేస్తున్నారు. పాన్ ఇండియా సినిమాల మీద ఇప్పుడు హీరోలు ఎక్కువగా ఫోకస్ చేసిన సంగతి తెలిసిందే. చిన్న హీరోలు కూడా మార్కెట్ మీద మమకారం తో బాలీవుడ్ పరిచయాల కోసం ఎక్కువగా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ విషయానికి వస్తే తారక్ బాలీవుడ్ లో ఒక సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. 

 

ప్రస్తుతం తారక్ ఆర్ఆర్ఆర్ అనే సినిమాలో చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. గ్యాప్ దొరికినా సరే ఈ సినిమా షూటింగ్ లో తారక్ పాత్ర ఇప్పట్లో పూర్తి అయ్యే అవకాశం లేదని అంటున్నారు. దీనితో తారక్ ఇప్పుడు గ్యాప్ దొరికితే ఒక బాలీవుడ్ సినిమాను చేసే ఆలోచనలో ఉన్నాడని టాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం తారక్ కోసం బాలీవుడ్ హీరోలు కొందరు ఎదురు చూస్తున్నారని ప్రచారం జరుగుతుంది. సోషల్ మీడియాలో దీనికి సంబంధించి కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి. 

 

ప్రస్తుతం తారక్ త్రివిక్రమ్ తో కూడా సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఆ సినిమా ఎప్పుడు విడుదల అవుతుంది అనేది ఆర్ఆర్ఆర్ మీద ఆధారపడుతుంది. ఈ సినిమా షూటింగ్ ముందు పనులు పూర్తి అయినా సరే ఇప్పుడు పక్కన పెట్టాడు త్రివిక్రమ్ అనే వార్తలు వస్తున్నాయి. నానీ తో ఒక సినిమాను కూడా ప్లాన్ చేస్తున్నాడని టాలీవుడ్ జనాలు అంటున్నారు. అందుకే ఇప్పుడు సమయం దొరికే అవకాశం ఉంది కాబట్టి తారక్ బాలీవుడ్ సినిమా మీద ఫోకస్ పెట్టాడు అని అంటున్నారు. మరి ఆ సినిమా ఏదీ హీరో ఎవరు అనేది చూడాలి. త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: