మన తెలుగులో అనుష్క కి ఉన్న క్రేజ్ గురించి అందరికి తెలిసిందే. ఆమె తో సినిమా చేయడానికి ఒకప్పుడు స్టార్ హీరోలు ఆసక్తి చూపిస్తూ ఉండేవారు. ఆమె తో సినిమా అనగానే దర్శక నిర్మాతలు కూడా ఎంతో ఆసక్తి చూపించే వారు. ఈ మధ్య కాలంలో తెలుగులో అయినా తమిళంలో అయినా ఇంతగా నిలబడిన హీరోయిన్ ఆమె ఒక్కరే అనేది అందరికి తెలిసిన విషయమే. ఆమె ఆవిధంగా మన తెలుగులో దగ్గరయ్యారు. ఆమె సినిమాలు చూడటానికి చాలా మంది ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. 

 

ఇది పక్కన పెడితే ఆమె పెళ్లి వ్యవహారం మాత్రం ఎప్పటికి ఒక హాట్ టాపిక్ అనేది వాస్తవం. ఆమె ఎవరిని పెళ్లి చేసుకునే అవకాశం ఉంది అనే దాని మీద ఎన్నో కథనాలు మన తెలుగులో వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఆమె పెళ్లి చేసుకునే విషయాన్ని కూడా మీడియా చాలా పెద్దది గా చేసి చూసిన సందర్భాలు ఉన్నాయి. ఇక ఇది ఇలా ఉంటే ఆమె ఒక దర్శకుడి కుమారుడ్ని పెళ్లి చేసుకోవాలి అని చూసింది అని ఈ మధ్య వార్తలు వచ్చాయి. ఆయనతో ప్రేమ వ్యవహార౦ ఆమెకు ఉందని ఆయన కూడా రెండు సినిమాలకు దర్శకత్వం వహించారు అని సమాచారం. 

 

ఆయనతో పెళ్లి చేసుకోవడానికి గానూ కుటుంబాన్ని కూడా ఆమె ఒప్పించింది అని సమాచారం. ఆమె ప్రస్తుతం తెలుగులో రెండు మూడు సినిమాలు చేస్తుంది. ఈ సినిమాలు అన్నీ కూడా ఆమె సోలో గానే చేస్తుంది. హీరోయిన్ గా సినిమాలు చేయడం దాదాపుగా ఆపేసింది ఆమె. మరి ఎప్పుడు ఎవరిని పెళ్లి చేసుకుంటుంది అనేది చూడాలి. ప్రస్తుత౦ ఆమె నటించిన సినిమా ఒకటి విడుదలకు సిద్దంగా ఉన్నా ఎప్పుడు విడుదల అవుతుంది అనేది చెప్పడం కష్టం. లాక్ డౌన్ తర్వాత విడుదల అయ్యే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: