ప్రస్తుతం జనరేషన్ లో సినిమా థియేటర్లకు వెళ్లి సినిమా చూడటం అనేది చాలా తక్కువ అయింది అని చెప్పవచ్చు. ఇప్పుడు అంతా OTT ఫ్లాట్ ఫామ్ నడుస్తుంది. అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, ఆహా... ఇంకా కొన్ని ఈ డిజిటల్ సేవలను అందిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే సినిమాలను సినిమా థియేటర్లో కాకుండా కొన్ని రోజుల తర్వాత కేవలం డిజిటల్ పరంగా విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 


ఇక అసలు విషయానికి వస్తే... ఇటీవల ఆహా... యాప్ తో అల్లు అరవింద్, కొడుకు అల్లు అర్జున్ OTT ఫ్లాట్ ఫామ్ లోకి అడుగుపెట్టారు. అయితే ఇప్పుడు మరో బాలీవుడ్ బడా నిర్మాత ఈ ప్లాట్ ఫామ్ లోకి అడుగు పెట్టబోతున్నారు. ఆయన ఎవరో కాదు స్వర్గీయ దగ్గుబాటి రామానాయుడు మొదటి కుమారుడు దగ్గుపాటి సురేష్ బాబు. ప్రస్తుతం OTT ఫ్లాట్ ఫామ్ కు ఉన్న క్రేజ్ పరంగా టాలీవుడ్ బడా నిర్మాతలు ఈ బిజినెస్ లోకి అడుగు పెట్టేందుకు చాలా ఉత్సాహం చూపుతున్నారు.అయితే ఇప్పటికే పెద్ద నిర్మాత అయిన అశ్వనీదత్, అల్లు అరవింద్, బాహుబలి చిత్రం నిర్మించిన నిర్మాతలు, శరత్ మరార్ వీరందరూ ఇప్పటికే ఈ బిజినెస్ లోకి అడుగుపెట్టగ తాజాగా సురేష్ బాబు ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టబోతున్నాడు.


అయితే సురేష్ బాబు ఒక ఇంటర్వ్యూలో ఈ OTT ఫ్లాట్ ఫామ్ లోకి అడుగు పెట్టబోతున్న విషయాన్ని చెప్పకనే చెప్పారు. అయితే తొందరలో పలు వెబ్ సిరీస్ లను తయారుచేసేటట్లు ఆయన ప్రణాళికలు చేసుకుంటున్నట్లు కొన్ని విషయాలు తెలుస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఆయన ఒక ప్రముఖ OTT సంస్థతో సంప్రదింపులు చేసినట్లు కూడా సమాచారం తెలుస్తోంది. అయితే ఆయన ఎప్పుడు ఈ ఇండస్ట్రీలోకి ఎంటర్ అవుతారన్నది పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: