ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధానాన్ని అమలులోకి తీసుకుని రావడం జరిగింది. దీనితో సామాన్య ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ కూడా ఇళ్లకే పరిమితమయ్యారు. ఇటీవల ఇండస్ట్రీలో "బీ ది రియల్ మెన్ " ఛాలెంజ్ లో చాలా వరకు ఇంటి పనులలో నిమగ్నమై ఉన్నారనే చెప్పాలి. అటు చిరంజీవి ఈ ఛాలెంజ్ లో భాగంగా తల్లి అంజనాదేవికి దోశ వేసి ఇచ్చాడు. అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్  తన భార్య ఉపాసన అద్భుతమైన కాఫీ కూడా పెట్టి ఇవ్వడం జరిగింది. ఇక ఇలా పలు చాలెంజ్ సినీ ప్రముఖులు అందరు కూడా ఇంట్లో వారి కుటుంబ సభ్యులకు సహాయపడుతున్నారు. 

అయితే ఇది ఇలా ఉండగా తాజాగా రామ్ చరణ్ తన నాన్నమ్మ దగ్గర రెసిపీ నేర్చుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ట్విట్టర్ వేదికగా చేసుకొని తన అభిమానులతో షేర్ చేసుకోవడం జరిగింది. ఇంతకీ ఆ రెసిపీ ఏమి అనుకుంటున్నారా అదేనండి వెన్న తయారుచేయడం. చిక్కటి పెరుగు నుండి వెన్న తీయడం ఎలా అనేది నేర్చుకున్నాడు రామ్ చరణ్. ఇక గతంలో అయితే పెరుగు నుండి వెన్న తీయడానికి కవ్వంతో తీసే వారు కానీ కాలం మారే కొద్ది... ఎలక్ట్రిక్ వీల్ ఇప్పుడు రావడం జరిగింది. ప్రస్తుతం రామ్ చరణ్ కూడా ఎలక్ట్రిక్ మిషన్ తో వెన్న తీయడం చేశాడు. అది కూడా వాళ్ళ నానమ్మ పర్యవేక్షణలోనే జరిగింది. ఇంకా ఇలా రామ్ చరణ్ మజ్జిగ చిలకడం చూసి అంజనాదేవి కృష్ణుడి లాగా ఉన్నావ్ అంటూ ప్రశంసల వర్షం కురిపించింది.

 

అయితే చెర్రీ తండ్రి చిరు ccc సంస్థను ఏర్పాటు చేసి సినీకార్మిక కుటుంబాలకు ఆ సంస్థ ద్వారా సేవ చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. అయితే ఇందుకు గాను హీరోలు, హీరోయిన్లు, ఇక టాలీవుడ్ బడా నిరంతలు, దర్శకులు ఈ సంస్థకు భారీ విరాళాలను అందచేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: