టాలీవుడ్ మీదనే అందరి కన్నూ ఉంటుంది. ఎందుకంటే అక్కడ తళుకు బెళుకుల తారలు ఉంటారు. వారి గురించి తెలుసుకోవాలన్నది సగటు ఆడియన్ ఆసక్తి, ఆశ కూడా. అందువల్ల టాలీవుడ్ ముచ్చట్లు ఎన్ని చెప్పినా ఇంకా చెప్పాలంటారు. వారి ఊసులు ఇంకా కావాలంటారు. టాలీవుడ్ గ్లామరే వేరు.

 

ఇదిలా ఉండగా టాలీవుడ్లో గత మూడు దశాబ్దాలుగా ఉన్న మా అసోసియేషన్ అన్నది అందరికీ గుర్తుండే ఉంటుంది. మా అంటే నటుల కోసం ఏర్పాటు చేసింది. సినిమా నటులు చిన్నా చితకా నుంచి పెద్ద స్థాయి వరకూ ఉన్నారు. మాకు తొలి ప్రెసిడెంట్ చిరంజీవి. ఆ తరువాత సుదీర్ఘ కాలం మురళీ మోహన్ కొనసాగారు. ఆ తరువాత మోహన్ బాబు, నాగార్జున, నాగ‌బాబు, రాజేంద్రప్రసాద్ చేశారు, చివరిగా శివాజీ రాజా నుంచి ఇపుడు సీనియర్ హీరో నరేష్ చేతికి పగ్గాలు వచ్చాయి.

 

అయితే మాలో ఉన్న విభేధాలతో తరచూ అది వీధిన పడుతోంది. పేరుకు వేయి మంది లోపు ఉన్న ఆర్గనైజేషనే కానీ మాలో ఉన్న నటుల గ్లామర్ మూలంగా అందులో ఏ చిన్నది జరిగినా పెరిగి పెద్దదవుతోంది. బయటకు వచ్చి పెను వివాదంగా మారుతోంది. ఇవన్నీ ఇలా ఉంటే కరోనా నేపధ్యంలో ఇపుడు చిరంజీవి అధ్యక్షతన మరో కమిటీ ఏర్పాటైంది.

 

దీని పేరు సీసీసీ. ఇది కూడా చి సినీ కార్మికుల కోసం ఏర్పాటు అయిన సంస్థే. దానికి చిరంజీవి నాయకత్వం వహిస్తున్నారు. మాతో సహా అన్ని సంస్థలు ఇందులో ఇన్వాల్స్ అయిపోయాయి. దానికి తోడు సినీ పరిశ్రమకు పెద్దన్నగా చిరంజీవి ఉండడంతో ఆయన్ని కాదని ఎవరూ ముందుకు పోలేని పరిస్థితి. దాంతో మా కధ సమాప్తం అంటున్నారు. 

 

మాలో విభేదాలు ఎంతలా రచ్చకెక్కాయంటే ఏకంగా చిరంజీవి ఎదుటే మైకు లాగేసుకుని హేరో రాజశేఖర్ మాట్లాడి కొన్నాళ్ళ క్రితం అతి పెద్ద  గలాటా పుట్టించాడు. నాటి నుంచే మా ఆయుష్ష్దు ఆగిపోయిందని  అంటున్నారు. మొత్తం మీద చూసుకుంటే మా లో విభేదాలు ఇపుడు మూడు దశాబ్దాల సంస్థనే కనుమరుగు చేస్తున్నాయా అన్న భావన అందరిలో కలుగుతోందిట.

మరింత సమాచారం తెలుసుకోండి: