చిన్న హీరోలకు మన తెలుగులో మంచి గుర్తింపు ఉంటుంది. వారి సినిమాలకు మంచి ఆదరణ కూడా ఉంటుంది. కాని ఇప్పుడు సినిమాల్లో అది ఎక్కడా కనపడటం లేదని టాక్ వినపడుహుంది. చిన్న చిన్న హీరోలతో సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు ముందుకు రావడం లేదు అనే వార్తలు వస్తున్నాయి. టాలీవుడ్ జనాలకు కొత్తదనం కావాల్సి ఉన్నా సరే అదే హీరో అదే సినిమా అదే కథ అన్నట్టు ఉంది ఇప్పుడు టాలీవుడ్ లో పరిస్థితి. నానీ  లాంటి హీరోని కూడా టాలీవుడ్ లో పక్కన పెట్టారు అనే ప్రచారం జరుగుతుంది. 

 

ప్రస్తుతం మన తెలుగులో వరుసగా సినిమాలు వస్తున్నాయి. లాక్ డౌన్ కారణంగా సినిమాలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ సినిమాల తర్వాత చిన్న హీరోలతో అసలు సినిమా చేసే పరిస్థితి లేదని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. చిన్న హీరోలకు అడ్వాన్స్ లు ఇచ్చిన నిర్మాతలు ఇప్పుడు వెనక్కు తీసుకునే పరిస్థితి నెలకొంది అని అంటున్నారు. చిన్న హీరోలు చాలా మందిని ఇప్పుడు టాలీవుడ్ జనం పెద్దగా పట్టించుకోవడం లేదు అనే టాక్ వినపడుతుంది. టాలీవుడ్ జనాలు మరీ కమర్షియల్ గా ఆలోచన చేసి చిన్న హీరోలను పక్కన పెడుతున్నారని అంటున్నారు. 

 

ఈ విధానం మంచిది కాదని సినిమాకు ఇది మంచి పరిణామం కాదనే టాక్ వినపడుతుంది. కొంత మంది మరీ దారుణంగా వ్యవహరిస్తున్నారట. హీరోలు ఫోన్ చేసినా సరే కనీసం లిఫ్ట్ చేసి మాట్లాడే పరిస్థితి లేదు అనే టాక్ వినపడుతుంది. టాలీవుడ్ లో ఇలాంటివి మంచి సంకేతాలు ఇచ్చే అవకాశం ఉండదు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళను మరీ అంత చులకనగా చూడకుండా ఉండటం మంచిది అని అంటున్నారు. ప్రస్తుతం మన తెలుగులో అగ్ర హీరోల సినిమాలు అన్నీ కూడా కమర్షియల్ గానే వస్తున్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: