టాలీవుడ్ లో రామ్ చరణ్ ఇప్పుడు స్టార్ హీరోగా ఒక వెలుగు వెలుగుతున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ సినిమాలకు ధ్రువ సినిమా తర్వాత మంచి క్రేజ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత రామ్ చరణ్ సినిమాల్లో పెట్టుబడులు పెట్టడానికి నిర్మాతలు కూడా ముందుకు వస్తున్నారు. రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ అనే సినిమాలో చేస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకులకు సంక్రాంతి కానుకగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమా తర్వాత అతను ఏ సినిమా చేస్తున్నాడు అనేది నిన్నటి వరకు స్పష్టత లేదు. కాని మీడియా లో వస్తున్న వార్తల ఆధారంగా చూస్తే... 

 

ఆయన అనీల్ రావిపూడి తో సినిమా చేయడానికి రెడీ అయినట్టు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. టాలీవుడ్ లో ఇప్పుడు అనీల్ రావిపూడి కి మంచి క్రేజ్ ఉంది. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఏ సినిమా చెయ్యాలా అని రామ్ చరణ్ కొంత కాలంగా ఆలోచిస్తున్నాడు. ఈ తరుణంలోనే అనీల్ రావిపూడి చెప్పిన కథ విన్న అతను ఆ సినిమాను ఓకే చేసాడని అంటున్నారు. త్వరలోనే ఈ సినిమా కు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే సూచనలు ఉన్నాయని అంటున్నారు. మహేష్ బాబు ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుంది. 

 

కాని ఈ సినిమాకు మరో నిర్మాత కూడా ఉంటారని అంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించే అవకాశం ఉందని మహేష్ బాబు జూనియర్ ఎన్టీఆర్ కలిసి ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకుని వెళ్ళే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఈ సినిమాలో మహేష్ ఒక కీలక పాత్రలో నటించే సూచనలు ఉన్నాయని కూడా అంటున్నారు. ప్రస్తుత౦ ఈ సినిమాకు సంబంధించిన కథను పూర్తి స్థాయిలో అనీల్ సిద్దం చేస్తున్నాడని టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి: