సినీ సీమను అందుకే విచిత్ర సీమ అంటారు. అక్కడ బయటకు కనిపించేవి లోపల ఉండవు, కరెన్సీ రివర్ అని కూడా ఇండస్ట్రీకి మారు పేరు. అక్కడ పడవలు వేసుకుని ఎవరు ఎంత సొమ్ము చేసుకుంటే వారిదే హాట్ సీట్. ఇండస్ట్రీలో సెంటిమెంట్లు ఎవరి మీద ఎవరికీ లేవని  అంటారు. అది చాలా నిజమని అనేక ఘటనలు అప్పుడూ, ఇపుడూ నిరూపించాయి.

 

దీనికి అచ్చమైన ఉదాహరణ నటభూషణ శోభన్ బాబు ఉదంతమే. ఆయన దివంగతుడై ఇప్పటికి పన్నెండేళ్ళు అయినా వెండితెరకు అందాల నటుడు గా అలాగే నిలిచిపోయారు. ఇక మొదట్లో  శోభన్ బాబు కెరీర్ అంతా ఒడిదుడుకులుగానే సాగింది. వెనకవచ్చిన క్రిష్ణ, హరనాధ్ వంటి వారు ముందుకు దూసుకుపోయినా శోభన్ బాబు హీరోగా నిలదొక్కుకోవడానికి పదకొండేళ్ళు సుదీర్ఘ కాలం పట్టిందంటే బాధాకరమే.

 

శొభన్ బాబు 1959లో భక్తశబరి మూవీ ద్వారా వెండితెరకు పరిచయం అయ్యారు. అయితే తొలి సినిమాగా రిలీజ్ అయింది దైవబలం. ఇందులో ఎన్టీయార్ హీరో. ఇక శోభన్ బాబు కి తొలి బ్రేక్ 1965లో వచ్చింది. ఆయన హీరోగా సుందర్ లాల్  నహతా, డూండీ కలసి రాజశ్రీ పిక్చర్స్  బ్యానర్ మీద వీరాభిమన్యు  మూవీని తీశారు. శోభన్ వేసిన తొలి పౌరాణిక చిత్రం అది. సినిమా సూపర్  డూపర్ హిట్ అయింది.

 


శోభన్ బాబు కెరీర్ని మలుపు తిప్పిన ఈ మూవీ తరువాత ఈ నిర్మాతల్లో ఒకరైన డూండీ వెంటనే గూడచారి 116 మూవీని స్టార్ట్ చేశారు. సహజంగానే సూపర్ హిట్ ఇచ్చిన హీరోనే కొత్త సినిమాలో కూడా కంటిన్యూ చేయడం అప్పట్లో అలవాటు. కానీ డూండీ ఆ మూవీకి అప్పటికి కొత్తగా వచ్చిన హీరో క్రిష్ణను తీసుకున్నారు. ఆ మూవీలో శోభన్ బాబుని మొదట అనుకున్నారుట. కానీ హీరోయిన్ జయలలిత పక్కన క్రిష్ణను పెట్టాలని ఆమె తల్లి సంధ్య సూచించారని అంటారు.

 

దాంతో నిర్మాత సైతం వారి మాటే విని శోభన్ బాబుకు షాకిచ్చారు.  ఇక అప్పటికే ఆర్హ్దికంగా ఇబ్బందులో ఉన్న శోభన్ బాబు అనివార్యంగా ఆ మూవీలో చిన్న అతిథి పాత్ర పోషించారు. మొత్తం మీద తరువాత కాలంలో క్రిష్ణను ఆ మూవీ ఎక్కడికో తీసుకుపోయింది. శోభన్ బాబు మరిన్ని కష్టాలు పడితే కానీ స్టార్ డమ్  రాలేదు. ఓ విధంగా శోభన్ బాబుది కష్టాలతో కూడిన ప్రయాణంగానే తొలి రోజులు సాగాయి అని చెప్పాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: