టాలీవుడ్ లో రాజమౌళి కి ఉన్న క్రేజ్ గురించి అందరికి తెలిసిందే. ఆయన సినిమా వస్తుంది అంటే చాలు ప్రేక్షకులు ఎంతో ఆశగా ఎదురు చూస్తారు. అయన సినిమా కథ గురించి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. సినిమా కథలో ఎలాంటి కోణాలు ఉన్నాయి ఏ విధంగా కథ ఉంటుంది అనేది కూడా  ఒక క్రేజ్ ఉంటుంది. ప్రస్తుతం ఆయన ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమాను విడుదల చేసే అవకాశం ఉంది. 

 

వచ్చే ఏడాది ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 8 న విడుదల చేస్తారని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. కాని అది వాయిదా పడే సూచనలే ఎక్కువగా ఉన్నాయి అనేది చాలా మంది మాట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన విడుదల చేసే సూచనలు ఉన్నాయి. ఈ సినిమా విషయంలో ఇప్పుడు కొన్ని మార్పులు చేసే ఆలోచనలో జక్కన్న ఉన్నారని అంటున్నారు. ఎన్టీఆర్ పాత్రకు సంబంధించి ఇప్పుడు మార్పులు చేసే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఎన్టీఆర్ తన పాత్ర విషయంలో కొన్ని మార్పులు అడిగినట్టు టాలీవుడ్ వర్గాలు చెప్తున్నాయి 

 

అతని పాత్రకు సంబంధించి దర్శకుడికి కీలక సూచనలు కూడా చేసాడని దానికి జక్కన్న కూడా ఓకే చెప్పారని టాలీవుడ్ లో టాక్. ఈ సినిమా విషయం లో ఇప్పుడు ప్రేక్షకులు ఏ స్థాయిలో ఎదురు చూస్తున్నారో అందరికి తెలిసిందే కథలో చిన్న మార్పు ఉంది అనే వార్త వచ్చినా సరే కథలో వచ్చే మార్పుల గురించి పెద్ద ఎత్తున కథనాలు మీడియాలో వస్తున్నాయి. మరి ఏ విధంగా మార్పులు చేస్తారు అనేది చూడాలి. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్ లు నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: