సినిమా అనగానే మనకు ఎన్నో గురుతులు, అనుభూతులు కళ్ళ మందుకు వస్తాయి. మెదడులో వాటి ఆలోచనలతో ఆహ్లాదం కలుగుతుంది. నిజానికి సినిమా అంటే కేవలం అందులోని కధ మాత్రమే కాదు, కధతో పాటు మన జీవితం కూడా సినిమాతో ముడిపడిఉంటాయి.

 

అందుకే సినిమాను మాత్రమే ప్రేమించరు ఎవరు. వారి అనుభూతుల కోసం కూడా పాత సినిమాలు చూస్తూంటారు. ఆ అనుభూతులు మళ్ళీ మళ్ళీన్ నెమరువేసుకుంటారు. ఇదిలా ఉంటే ఈ అనుభూతులకు అందమైన లోగిళ్ళు సినిమా హాళ్ళు.ఇపుడు సినిమా హాళ్ళు అభిమానులకు దేవాలయాలు. సినిమా చూడాలంటే ఎన్ని అందుబాటులోకి వచ్చినా కూడా థియేటర్ కి వెళ్ళి చూసే వారి జనాభా తగ్గకపోవడానికి ఆ మ్యాజిక్కే కారణం.

 

సరే ఇపుడు కరోనా మహమ్మారి కారణంగా సినిమా హాళ్ళు మూసేశారు. వీటిని మళ్ళీ తెరుస్తారా అంటే అది పెద్ద చర్చ. అంతకంటే పెద్ద ప్రశ్న. ఇక సినిమా హాళ్ళు తెరచినా మునుపటి సందడి ఉంటుందా అన్నది కూడా మరొక  ప్రశ్న. ఇక సినిమా హాళ్ళకు ఆయువు తీరే రోజు వచ్చిందని అంటున్నారు. నెలల తరబడి సినిమా హాళ్ళు తెరవకపోయినా సినిమాలను ఆడియన్స్ దగ్గరకు చేర్చే కొత్త మార్గాన్ని నిర్మాతలు ఎంచుకున్నారు. 

 

అదే ఓటీటీ. ఈ ఫ్లాట్ ఫారం ద్వారా సినిమాలు నేరుగా ఇంటికే వస్తాయి. అటు ఆడియన్స్ కి సినిమా దక్కుతుంది. ఇటు నిర్మాతకు కూడా కాసులు వెనక్కు వస్తాయి. మధ్యలో నష్టపోయేది ఎవరు అంటే కోట్లు ఖర్చు పెట్టి పెద్ద ఎత్తున థియేటర్లు కట్టుకున్న వారేనని అంటున్నారు. అంటే సినిమా హాళ్ళు ఇకపైన గత వైభవం అవుతాయన్నమాట.

 

ఇప్పటికే చాలా సినిమా హాళ్ళు కళ్యాణ మండపాలు అయ్యాయి. ఇపుడున్న పరిస్థితుల్లో మిగిలినవి కూడా వేర రకంగా యూజ్  అవుతాయేమోనన్న బెంగ అందరిలోనూ ఉంది. అంతా ఆన్ లైన్ అవుతున్న వేళ డిజిటల్ ఫార్మెట్ విస్తరిస్తున్న వేళ సినిమా హాలు ఫ్యూచర్ లో కనుమరుగు అవుతుందని అంటున్నారు. అదే జరిగితే సినీ ప్రియులకు బాధాకరమే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: