ప్రపంచంలో కరోనా వైరస్ వల్ల ఎన్ని కష్టాలు.. నష్టాలు ఎదురవుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  ఓ వైపు ప్రాణాలు పోతున్నాయి.. మరోవైపు ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతున్నాయి.  కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు వివిధ దేశాల్లో లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. దాంతో సినీ ఫీల్డ్ మొత్తం షట్ డౌన్ అయ్యింది.  ఈ కరోనా ఎఫెక్ట్ సామాన్యులే కాదు సెలబ్రెటీలను కూడ వదలడం లేదు. ఇప్పటికే సినీ ఫీల్డ్ కి చెందిన నటులు కన్నుమూశారు. ఇతర రంగాలకు చెందిన వారు కన్నుమూశారు.  తాజాగా  41 ఏళ్ల హాలీవుడ్ న‌టుడు క‌రోనా వ‌ల‌న కాలునే కోల్పోవ‌ల‌సి వ‌చ్చింద‌ట‌. కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన నిక్...  లాస్ ఏంజెలెస్ లోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కరోనా కారణంగా అతను తీవ్ర ఇన్ఫెక్షన్ కు గురయ్యాడు.

 

దీంతో అతని కుడి కాలి రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టి, ముక్కలుగా విడిపోయింది. ఇది ఊపిరితిత్తులకు చేరితే ప్రాణాలకే ముప్పు సంభవించే అవకాశం ఉంది. దీని ప్రభావం వల్ల గుండె పోటు వచ్చి ప్రాణాలకే ముప్పు వాటిల్లే పరిస్థితి ఉంద‌ని వైద్యులు భావిం‌చ‌డంతో త‌ప్ప‌ని ప‌రిస్తితుల‌లో అత‌ని కాలుని తొల‌గించాల్సి వ‌చ్చింది. న్యూయార్క్‌లో కూడా ఇలాంటి సంఘ‌ట‌న ఒక‌టి జ‌ర‌గ‌గా, చేతి వేలిని తీసేశారు వైద్యులు. అయితే ప్ర‌స్తుతం నిక్ కార్డెరో కోమాలో ఉన్న‌ట్టు తెలుస్తుంది.

 

ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కూడా ఇబ్బందుల్లో ఉందట.. నిక్ ఊపిరితిత్తులు తీవ్రంగా దెబ్బ‌తిన్న‌ట్టు తెలుస్తుండగా, వైద్యులు సాధార‌ణ స్థితికి తీసుకొచ్చే ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ట‌. ఈ సందర్భంగా నిక్ భార్య అమండ క్లూట్స్ మాట్లాడుతూ.. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఆయన ఆరోగ్యంపై డాక్టర్లు ఎంతో శ్రద్ద చూపిస్తున్నారని.. త్వరలో ఆయన నయం అవుతారని ఆశాభావం వ్యక్తం చేసింది. ప్రస్తుతం హాలీవుడ్ లో సైతం షూటింగ్స్, రిలీజ్ లు క్యాన్సల్ అయిన విషయం తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: