ప్రస్తుతం సోషల్ మీడియాలో పవన్ కల్యాణ్ మానియా నడుస్తోంది. పవన్ కళ్యాణ్ ఏ చిన్న వ్యాఖ్య చేసిన దాని గురించి ఎక్కువ వ్యూస్, లైక్స్, షేర్లు, కామెంట్లు, రీ ట్వీట్లు, డిస్కషన్లు అబ్బో ఇలా ఏంటి చాలానే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ అంటే యువత పిచ్చిపట్టిన వారిలా పవన్ కళ్యాణ్ పట్ల ఆరాధనా భావాన్ని వ్యక్తపరుస్తారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాలకు తాత్కాలిక సెలవు తీసుకుని వకీల్ సాబ్ సినిమాను చేస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా ప్రస్తుతం సినిమా కాస్త షూటింగ్ ఆగిందనుకోండి. ఇప్పుడు యువత దృష్టంతా ఈ సినిమా మీదే ఫోకస్ అయ్యింది. అయితే ఈ సినిమా నుంచి మగువ.... ఓ మగువా.... అనే పాట రికార్డ్ క్రియేట్ చేస్తోంది
పవన్ కళ్యాణ్ మొదటి నుండి తన ప్రతి సినిమాలో స్త్రీ పాత్రలకు ఎంతో ప్రాధాన్యం ఇస్తూ వచ్చారు.. ప్రతి సినిమాలో మహిళల పట్ల గౌరవం. ఎవరైనా వారిని ఇబ్బంది పెడితే వారికి బుద్ధి చెప్పడం. ఆడవాళ్ళ గొప్పతనాన్ని సమాజానికి చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు.. తొలిప్రేమ సినిమాలో చెల్లెలు సెంటిమెంట్ దగ్గర నుండి, తమ్ముడు సినిమాలో జాను అనే క్యారెక్టర్ని డిజైన్ చేసిన విధానం, బంగారం సినిమా లో హీరోయిన్ చెల్లిని విలన్ గ్యాంగ్ కిడ్నాప్ చేసినప్పుడు కాపాడే క్రమంలో హీరో క్యారెక్టర్ చెప్పే ఫిలాసఫీ, అన్నవరం సినిమాలో అద్భుతమైన చెల్లెలి సెంటిమెంట్, జానీ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ని డిజైన్ చేసిన తీరు.
కొమరం పులి లో అమ్మ సెంటిమెంట్ .. తీన్మార్ సినిమాలో హీరో అర్జున్ పాల్వాయ్ క్యారెక్టర్, బాలు సినిమాలో జయసుధ పాత్రతో సెంటిమెంట్. పంజా సినిమాలో తన స్నేహితురాలు జాహ్నవిని కాపాడే విధానం.... మరీ ముఖ్యంగా గుడుంబా శంకర్ సినిమాలో వారిని గౌరవిస్తూ ఆ సినిమాలో లే.. లే.. పాటతో ఆడపిల్లలను ఏడిపించే వాళ్లను శిక్షించడం. గబ్బర్ సింగ్ సినిమా లో మళ్లీ మదర్ సెంటిమెంట్. గోపాల గోపాల సినిమా లో ద్రౌపది పాయింట్ ఆఫ్ వ్యూ లో ధర్మాన్ని వివరించిన తీరును. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉదాహరణలు ఉన్నాయి... పవన్ కళ్యాణ్ గారికి ఆడవారి పట్ల ఉన్న గౌరవం అభిమానం తన సినిమాల ద్వారా చెప్పకనే చెప్పాడు. మరి రాబోయే వకీల్ సాబ్ కూడా మహిళల పట్ల గౌరవాన్ని ఎలా చూపించబోతున్నాడు అనే ఉత్సుకత అభిమానుల అందరిలో నిండి ఉంది.
శ్రీకాకుళం జిల్లా, ఇచ్ఛాపురం నియోజకవర్గంలో సహాయ, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, "కరోనా" కష్ట కాలంలో 900 కుటుంబాలకు కూరగాయలు పంపిణీ చేసి ప్రజలకు అండగా నిలుస్తున్న జనసైనికుడు శ్రీ తిప్పన దుర్యోదన రెడ్డి గారికి @JanaSenaParty తరపున, నా తరపున హృదయపూర్వక అభినందనలు, వందనాలు...🙏 pic.twitter.com/lknbtFEVzn
— pawan Kalyan (@PawanKalyan) April 24, 2020