రాజమౌళి, కొరటాల.. సుకుమార్ లాంటి సక్సెస్ ఫుల్ డైరెక్టర్స్ బి ద రియల్ మేన్ ఛాలెంజ్ ను లైట్ గా తీసుకొని రొటీన్ గా ముగిస్తే.. దేవిశ్రీ ప్రసాద్ మాత్రం సీరియస్ గా తీసుకున్నాడు. స్టార్ డైరెక్టర్స్ ను మించి క్రియేటివిటీ చూపించాడు. సుకుమార్ విసిిరిన ఛారెంజ్ కు తన సృజనాత్మకతను జోడించి ఎలా పూర్తి చేశాడో తెలుసా.. 

 

ఎప్పుడూ క్లీన్ షేవ్ తో ఉండే దేవిశ్రీ ప్రసాద్ గడ్డం పెంచి డిఫరెంట్ గా కనిపించాడు. లాక్ డౌన్ టైమ్ లో మన సెలబ్రెటీలు ఇంటి పనుల్లో మహిళలకు సాయంగా ఉంటూ.. రియల్ మ్యాన్ అనిపించుకుంటున్నారు. సుకుమార్ విసిరిన ఛాలెంజ్ ను స్వీకరించిన దేవిశ్రీ ప్రసాద్ ట్విట్టర్ లో వీడియోను రిలీజ్ చేశాడు. దేవిశ్రీ ప్రసాద్ బి ద రియల్ మేన్ వీడియో మేకింగ్ అందరి వీడియో కంటే డిఫరెంట్ గా ఆకట్టుకుంటోంది. చివరిలో తండ్రి సత్యమూర్తి ఫోటోలు తుడుస్తూ.. బ్యాక్ గ్రౌండ్ లో నాన్నకు ప్రేమతో పెట్టి సెంటిమెంట్ తో ఆకట్టుకున్నాడు దేవిశ్రీప్రసాద్. 

 

సందీప్ రెడ్డి వంగా, రాజమౌళి, చిరంజీవి వీడియోలను చూశాక తను కూడా బిద రియల్ మేన్ ఛాలెంజ్ లో భాగమయ్యానని.. సుక్కు బాయ్ ఛాలెంజ్ వీడియో ఇదిగో అంటూ ట్వీట్ చేశాడు దేవిశ్రీ ప్రసాద్. అలాగే.. అల్లు అర్జున్, కార్తి, యశ్, హరీశ్ శంకర్ అలాగే మోహన్ లాల్ ను ఈ ఛాలెంజ్ కు నామినేట్ చేశాడు. 

 

ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరు హిట్ తో జోరుమీదున్న దేవిశ్రీ ప్రసాద్ ఉప్పెన.. పుష్ప.. అల్లుడు అదుర్స్.. రంగ్ దే సినిమాలకు మ్యూజిక్ అందిస్తున్నాడు. సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమైన ఉప్పెన సినిమా రిలీజ్ కరోనా ఆగింది. బి ద రియల్ మేన్ ఛాలెంజ్ ను దేవిశ్రీ ప్రసాద్ ఐదుగురికి విసిరాడు. అందులో నలుగురు హీరోలు.. ఒక డైరెక్టర్ ఉన్నాడు. ముందుగా ఎవరు దేవిశ్రీ ప్రసాద్ ఛాలెంజ్ ను స్వీకరిస్తారో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: