భారత్ లో ఉండే సినీ అభిమానానిక ప్రపంచంలో మరే దేశం కూడా పోటీ రాలేదు. హీరోలపై అభిమానానికి, అభిమానుల ఆనందానికి మన దేశంలో హద్దు ఉండదు. ఈ విషయంలో ప్రపంచంలో భారత్ సెపరేట్ అయితే భారత్ లో దక్షిణాది రాష్ట్రాలు సెపరేట్. దక్షిణాదిలో తెలుగు, తమిళ వాళ్ల సినీ అభిమానం వేరు. ఈ రెండు భాషల్లో ఓ హీరోను అభిమానించే స్థాయికి ఆకాశమే హద్దు. ప్రస్తుతం ఈ విషయాన్ని నిరూపిస్తున్నారు తమిళ హీరోలు విజయ్అజిత్ అభిమానులు. నేడు అజిత్ పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియాలో ఇరు హీరోల అభిమానులు వాదులాడుకుంటున్నారు.

 

 

సోషల్ మీడియా అందుబాటులో ఉండటంతో ఇప్పుడు హీరోల అభిమానులు ఇందులోనే పోటీలు పెట్టుకుంటున్నారు. అజిత్ పుట్టినరోజును ఇండియా వైడ్ గా ట్రెండ్ చేయాలని భావించి ఆ ప్రయత్నాలు చేసుకున్నారు. వీరికి వ్యతిరేకంగా విజయ్ అభిమానులు సోషల్ మీడియాలోకి వచ్చారు. ‘ఫేస్ ఆఫ్ కోలీవుడ్’ అంటూ విజయ్ అభిమానులు రెచ్చిపోతున్నారు. ఇలా అజిత్ అభిమానులకు విజయ్ అభిమానులు పోటీకి రావడంతో అజిత్ పుట్టినరోజు ఆనందాన్ని అభిమానులు ఎంజాయ్ చేయలేకపోయారు. దీంతో ఇద్దరు హీరోల అభిమానుల మధ్య వార్ మొదలైపోయింది. సినిమా రిలీజ్ సమయంలో పోటీలు సహజమే అయినా ఇలా ఒకరి పుట్టినరోజు సందర్భంగా రెచ్చగొట్టే ధోరణికి వెళ్లడం ఏ హీరో అభిమానులకు తగదు.

Image

 

గతంలో అభిమానులు తమ హీరో కలెక్షన్లు ఇంత అంటూ కేవలం పోస్టర్లు, పాంప్లేట్లు ప్రింట్ చేసుకోవడంతో సరిపెట్టేవారు. లేదంటే బ్యానర్లు కట్టే విషయంలో పోటీ పడేవారు. కానీ.. ఇలా ఓ హీరోకు వ్యతిరేకంగా అనవసరమైన సమయాల్లో స్పందించే వారు కారు. ప్రస్తుతం ఫ్యాన్స్ ధోరణి విపరీతంగా మారింది అనటానికి ఈ రోజు ఉదంతమే ఉదాహరణ. మరి అభిమానుల విషయంలో అజిత్విజయ్ ఎలా స్పందిస్తారో చూడాలి.

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: