ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనాని నియంత్రించేందుకు గాను అన్ని దేశాలు లాక్ డౌన్ పాటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే మన దేశంలో ఒక పక్క లాక్ డౌన్ కొనసాగుతున్నా మన దేశంలో 33 వేలకు పైగా కరోనా కేసులు నమోదు అయ్యాయి.  ఈ వైరస్ నియంత్రణ కు  ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న డాక్టర్లు, పొలీస్ లు, పారిశుధ్య కార్మికులకు మన వంతుగా ప్రధాని మోడీ ఇచ్చిన పిలుపు మేరకు వారందరికీ కరతాళ ధ్వనులతో ధన్యవాదాలు తెలిపిన సంగతి తెలిసిందే. తాజాగా టాలీవుడ్ అగ్ర దర్శకుల్లో ఒకరైన దర్శకేంద్రుడు కే. రాఘవేంద్రరావు తనదైన స్టయిల్ లో స్పందించారు.

 

వివరాల ప్రకారం టాలీవుడ్ లో దాదాపు వందకు పైగా సినిమాలు తీసి దర్శకత్వంలో తన కంటూ ఒక ఇమేజ్  సంపాదించిన డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు. తాజాగా ఆయన కరోనా వైరస్ వ్యాప్తికి సంబంధించి చేస్తున్న పోరాటంపై మనం విజయాన్ని సాధించాలని ఆయన ఆకాంక్షించారు. కోవిడ్ 19 పై పోరాటంలో ప్రాణాలను లెక్క చేయక ముందు ఉండి  పోరాడుతున్న  పోలిస్ లకు, డాక్టర్ లకు కార్మికులకు తన ధన్య వాదాలు తెలియచేసారు. అంతేకాక కరోనా వ్యాప్తిని అరికట్టుటలో విజయం కలగాలని భగవంతుడికి పూజ చేసి మరి వేడుకున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.  


రాఘవేంద్రరావు గారు కృష్ణా జిల్లాలోని కంకి పాడు మండలంలో జన్మించారు. సినిమాల పై ఉన్న ఇష్టంతో ఇండస్ట్రీలో అడుగు పెట్టి అంచలంచెలుగా ఎదిగారు. తన సిని ప్రస్థానంలో  శతాధిక చిత్రాల దర్శకుడు గాను, నిర్మాతగానూ వ్యవహరించారు. ఈయన సినిమాలలో ఎక్కువగా భక్తి సంబంధిత చిత్రాలే ఉంటాయి. ఈయన టిటిడి పాలక మండలిలో కూడా ఒకరు గా ఉన్నారు. ఆయన సినిమాలలో ఎక్కువగా లేడి ఓరియంటెడ్ సినిమాలే ఉంటాయి. జ్యోతి, ఆమె కథ, కల్పనా వంటి చిత్రాలు.

మరింత సమాచారం తెలుసుకోండి: