ప్రస్తుతం టాలీవుడ్ లో బాగా లాస్ లో ఉన్న నిర్మాత ఎవరంటే ఠక్కున చెప్పే పేరు దిల్ రాజు అనే. ఈ మద్య కాలంలో ఆయన నిర్మిస్తున్న కొన్ని సినిమాలు భారీ డిజాస్టర్స్ గా మిగులుతున్నాయి. దానికితోడు డిస్ట్రిబ్యూట్ చేసిన సినిమాలు బాగా నష్ఠాలపాలు చేస్తున్నాయి. ఎన్నో ఆశలు పెట్టుకొని కాస్తైనా బయటపడతా అనుకున్న జాను సినిమా కూడా దిల్ రాజు కి నిరాశనే మిగిల్చింది. అయినా పవన్ కళ్యాణ్ తో భారీ బడ్జెట్ ని కేటాయించి వకీల్ సాబ్ ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా మే 15 న గ్రాండ్ గా రిలీజ్ చేయాలనుకున్నాడు. ఇక ఇప్పటికే నాని ఇంద్రగంటి మోహన కృష్ణ కాంబినేషన్ లో నిర్మించిన వి సినిమా రిలీజ్ కావాల్సింది లాక్ డౌన్ కారణంగా ఆగిపోయింది. ఇప్పట్లో థియోటర్స్ తెరుచుకునే పరిస్థితి ఏమాత్రం కనిపించడం లేదు. దాదాపు ఆగస్ట్ లేదా సెప్టెంబర్ వరకు ఇదే పరిస్థితి కొనసాగేలా ఉంది. 

 

దీంతో ఇంట్లోనే ఉంటున్న ప్రేక్షకులు ఎక్కువగా ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ అయిన అమేజాన్ ప్రైమ్, నెట్ ప్లిక్స్, ఆహా, జీ5 లలో సినిమాలు చూస్తూ కాలక్షేపం చేస్తున్నారు. ఒకరకంగా ఇంట్లోనే ఎంటర్‌టైన్‌మెంట్ దొరుకుతుండటం తో బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పట్లో థియేటర్లు  ఓపెన్ కాని కారణంగా కొన్ని సినిమాలను ఆన్ లైన్ లోనే చూసేస్తున్నారు. 'అమృతరామమ్' ఇలా డైరెక్ట్ గా ఆన్ లైన్ లో రిలీజైన మొట్టమొదటి తెలుగు సినిమా. ప్రముఖ నిర్మాత సురేష్ బాబు సమర్పించిన ఈ సినిమా కొన్ని రోజుల క్రితం జీ 5 లో విడుదలైంది. కాని నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. దాంతో స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ లో చాలా తక్కువ వ్యూస్ వస్తున్నాయట. దీంతో చిన్న సినిమాలు వద్దనుకొని పెద్ద సినిమాలను ఓటీటీలలో పెట్టాలని భావిస్తున్నాయట. క్రేజీ మూవీస్ అయితే ప్రేక్షకులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తారన్న భావన.

 

ఈ నేపథ్యంలో ఓటీటీల కన్ను ఇప్పుడు నాని - సుధీర్ బాబు హీరోలుగా నటిస్తున్న ‘వి’ సినిమా మీద పడిందట. అందుకే దిల్ రాజు ని అట్రాక్ట్ చేస్తున్నారట. ఇప్పటికే దిల్ రాజు ఈ సినిమా రైట్స్ ను 35 కోట్ల ధరలకు అమ్మడానికి సిద్ధంగా ఉన్నాడట. ‘వి’ సినిమా స్ట్రీమింగ్ హక్కులను పొందటానికి అమెజాన్ ప్రైమ్ నిర్మాత దిల్ రాజుతో చర్చలు జరుపుతుందని సమాచారం. అయితే దీనికోసం అమెజాన్ ప్రైమ్ 20 కోట్ల మొత్తాన్ని చెల్లించడానికి సిద్ధంగా ఉందట.. అలాగే మొదటి వారం రన్ తర్వాత 'పే ఫర్ అవర్' మోడల్ ప్రకారం చెల్లిస్తారట. 

 

ఫస్ట్ వీక్ తర్వాత సినిమా ఎక్కువ మొత్తంలో వసూల్ చేయకపోవచ్చు. కాబట్టి 35 కోట్ల డిమాండ్ పై మాత్రమే దిల్ రాజు ఆసక్తిగా ఉన్నారట. అంతేకాకుండా మరిన్ని పెద్ద సినిమాలు డైరెక్టుగా ఆన్ లైన్ లో వచ్చే అవకాశం ఉంది. మరోవైపు అనుష్క 'నిశ్శబ్దం' సినిమా కూడా ఆన్ లైన్ లో డైరెక్టుగా విడుదల అవుతుందని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ దిల్ రాజు గనక కాంప్రమైజ్ అయి రిలీజ్ చేస్తే రానున్న రోజుల్లో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని కొందరు సూచిస్తున్నారట. ఒకవేళ ఆన్ లైన్ లో ప్రేక్షకులు చూడడానికి ఆసక్తి చూపించకపోతే అనుకున్న షేర్ రాకపోవచ్చు అపుడు మోసపోయోది దిల్ రాజు నే అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: