దేశంలో లాక్ డౌన్ పరిస్థితులకు కారణమైన కరోనా వైరస్ ప్రజలను ఇళ్లకే పరిమితం చేసింది. ఇప్పటికే నెల రోజులకు పైగా ప్రజలందరూ ఇళ్లకే పరిమితమైపోయారు. వారికి యూట్యూబ్, ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో సినిమాలే దిక్కయ్యాయి. సినీ సెలబ్రిటీలు కొందరు తర్వాతి ప్రాజెక్టులపై వర్క్ చేసుకుంటున్నారు. హీరో అడవి శేష్ ఈ లాక్ డౌన్ టైమ్ తనకిష్టమైన తెలుగు స్ట్రైట్ సినిమాలు, డబ్బింగ్ సినిమాలు, ఇంగ్లీష్ సినిమాల లిస్టును తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశాడు.

 

 

తెలుగు స్ట్రైట్ సినిమాల్లో టాప్ 20 సినిమాలను లిస్ట్ అవుట్ చేశాడు. తెలుగు సినీ పరిశ్రమ గర్వించే సినిమాలు, ట్రెండ్ సెట్టర్ సినిమాలు అందులో ఉన్నాయి. ‘మిస్సమ్మ, గుండమ్మ కథ, ఖైదీ, జగదేకవీరుడు అతిలోకసుందరి, శివ, గాయం, మనీ, హలో బ్రదర్, తొలిప్రేమ, అతడు, బాహుబలి, మళ్లీ రావా, పెళ్లి చూపులు, జెర్సీ..’ .. ఇలా ఓ 20 సినిమాల లిస్టును ప్రిపేర్ చేసుకున్నాడు. డబ్బింగ్ మూవీస్ లో 10 సినిమాలను ఎంచుకున్నాడు. ‘దళపతి, భాషా, క్షత్రియపుత్రుడు, రోజా, బొంబాయి, సఖి..’తో మొదలైన సినిమాలను లిస్ట్ చేసుకున్నాడు. హిందీ సినిమాల్లో కూడా 20 ఎంచుకున్నాడు. ‘సత్య, రంగీలా, లగాన్, స్వదేశ్, దీవార్’.. వంటి సినిమాలు ఉన్నాయి.

 

 

ఇంగ్లీష్ మూవీస్ లో కూడా 10 సినిమాలను ఆల్ టైమ్ ఫేవరేట్స్ గా చెప్పుకున్నాడు. ‘పోలిస్ స్టోరీ, ది ఇన్ సైడర్, ఫస్ట్ బ్లడ్, ది డార్క్ నైట్, సిండ్రిల్లా మ్యాన్, ఆర్గో..’ వంటి సినిమాలను ఎంచుకున్నాడు. వీటన్నింటినీ ‘మోర్ టు కమ్.. లాక్ డౌన్ లో చూసేందుకు’ అని క్యాప్షన్ కూడా రాసుకున్నాడు. మరి వీటిలో ఇప్పటివరకూ కొన్ని చూశాడో.. లాక్ డౌన్ ఇంకా పొడిగింపు ఉంటుందన్న ఊహాగానాల మధ్య లిస్ట్ చేసుకున్నాడో తనే చెప్పాల్సి ఉంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: