టాలీవుడ్ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొత్తానికి రెండేళ్ల తర్వాత ప్రస్తుతం నటిస్తున్న సినిమా వకీల్ సాబ్. బోనీ కపూర్, దిల్ రాజు కలిసి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి యువ దర్శకుడు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా, అంజలి, నివేతా థామస్, ప్రకాష్ రాజ్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక దీని తర్వాత మరొక రెండు సినిమాలు కూడా లైన్లో పెట్టిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రస్తుతం నెంబర్ వన్ స్థానానికి దగ్గరగా ఉన్న నటుల్లో ఒకరు అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. 

IHG

ఇక ఇటీవల భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు వంటి వరుస మూడు సూపర్ హిట్ లతో హ్యాట్రిక్ సాధించిన సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన కూడా ప్రస్తుతం టాలీవుడ్ లో నెంబర్ వన్ స్థానానికి అతి దగ్గరగా ఉన్న నటుల్లో ఒకరు. ఇక వీరిద్దరూ దాదాపుగా అన్ని ఏరియాల్లో కూడా ఒకే విధమైన మార్కెట్ ని, క్రేజ్ ని కలిగి ఉన్నవారు. అయితే కొన్ని ఏరియాల్లో పవన్ ముందంజలో ఉంటే, మరి కొన్ని ఏరియాల్లో మహేష్ ముందంజలో ఉన్నారు. ఒక రకంగా వీరిద్దరి సినిమాలు యావరేజ్ టాక్ ని సంపాదిస్తే చాలు, వాటిని తమ క్రేజ్, ఫ్యాన్ ఫాలోవింగ్ తో సూపర్ హిట్ చేయగల కెపాసిటీ  ఉన్న పవర్ఫుల్ హీరోలు వీరు. అయితే ఎప్పటినుంచో వీరిద్దరూ కలిసి ఒక సినిమా చేస్తే చూడాలని పవర్ స్టార్, సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఇద్దరూ కూడా కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. 

IHG

ఆమధ్య కొన్నాళ్ల క్రితం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ ,పవన్ కలిసి ఒక సినిమా చేస్తారనే వార్తలు హల్ చల్ చేశాయి. అయితే అది ఇప్పటికీ కూడా ఎటువంటి కార్యరూపం దాల్చలేదు. కాగా రాబోయే రోజుల్లో అయినా వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తే చూడాలని ఆశపడుతున్న ఫ్యాన్స్ కోరిక ఎప్పుడు తీరుతుందో తెలియదు కానీ, ఒకవేళ వీరిద్దరూ కలిసి నిజంగానే సినిమా చేస్తే మాత్రం ఆ సినిమా దెబ్బకి బాక్సాఫీస్ రికార్డులు మొత్తం భయంతో బెంబేలెత్తడం ఖాయమనే చెప్పాలి.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: