రోజు రోజుకు ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గత వారం రోజులుగా పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అత్యధిక మొత్తంలో కరోనా ర్యాపిడ్ టెస్టులు నిర్వహించడం వల్ల ఎక్కువ కేసులు బయటకు వస్తున్నాయి. ఇది ఒకందుకు మంచిదే అయినా జనాలు భయాందోళనలకు గురి అవుతున్నారు.

 

గత 24 గంటల్లో కొత్తగా మరో 71 పాజిటివ్ కేసులు నమోదైనట్లు గురువారం బులిటెన్‌లో ఆరోగ్య ఆంధ్ర ప్రకటించింది. కర్నూలు జిల్లాలో 43, కృష్ణా జిల్లాలో 10.. గుంటూరు, కడప జిల్లాల్లో 4 చొప్పున.. అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో 3 చొప్పున.. తూర్పుగోదావరి, నెల్లూరు జిల్లాల్లో రెండు కేసులు చొప్పున నమోదయ్యాయి.

 

తాజా కేసులు కలిపితే మొత్తం కేసుల సంఖ్య 1403 కాగా.. డిశ్చార్జ్ అయిన వారు కాకుండా యాక్టివ్ కేసులు 1051గా ఉన్నాయి. కర్నూలు లో కేసుల సంఖ్య చూస్తుంటే ఆ ప్రాంత ప్రజలకు వెన్నులో వణుకు పుడుతోంది.

 

కర్నూలు జిల్లా -386

గుంటూరు జిల్లా - 287

కృష్ణా జిల్లా - 246

నెల్లూరు జిల్లా -84

చిత్తూరు జిల్లా - 80

కడప జిల్లా -73

ప్రకాశం జిల్లా - 60

పశ్చిమ గోదావరి జిల్లా - 56

అనంతపురం జిల్లా -61

తూర్పుగోదావరి జిల్లా - 42

విశాఖపట్నం జిల్లా -23

శ్రీకాకుళం జిల్లా - 5

మొత్తం కేసులు -1403

 

డిశ్చార్జి - 321

 

ఇక తెలంగాణలో కొత్తగా 6 కరోనా పాజిటివ్ కేసులు కొత్తగా నమోదయ్యాయి. ఒక్క రోజులో 24 మంది వైరస్ నుంచి పూర్తిగా కోలుకొని డిశ్చార్జి అయినట్లుగా వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు

 

కరోనా టెస్టుల విషయ్ంలో కొద్దిగా వేగం ప్రదర్శించారు. అదీ కాకుండా ఒక్క రోజే 24 మంది వైరస్ నుండి కోలుకొని డిశ్చార్జి కావడం గమనార్హం. దీనితో శుక్రవారం నాటి కేసులతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1044కు చేరింది.

మరింత సమాచారం తెలుసుకోండి: