ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ సినిమాలు తీసే విక్టరీ వెంకటేష్ జయంత్ సి.పరాన్జీ డైరక్షన్ లో చేసిన సినిమా ప్రేమించుకుందాం రా.. ఫ్యాక్షన్ కథలో లవ్ స్టోరీని కలిపి తీసిన ఈ సినిమా సెన్సేషనల్ హిట్ అందుకుంది. అప్పటికే వరుస హిట్లతో ఫుల్ ఫామ్ లో ఉన్న విక్టరీ వెంకటేష్ కెరియర్ కు మంచి బూస్టింగ్ ఇచ్చింది ప్రేమించుకుందాం రా. 1997లో వచ్చిన ఆ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఆ సినిమా ద్వారా అంజలా ఝవేరి తెలుగు తెరకు పరిచయమైంది. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథ అయినా వెంకటేష్, అంజలా ఝవేరిలా మధ్య వచ్చే లవ్ సీన్స్ చాలా ఫ్రెష్ గా ఉంటాయి. 

 

ముఖ్యంగా ఈ సినిమాలో హీరోయిన్ మీద తన ప్రేమను ఎక్స్ ప్రెస్ చేసేందుకు ఓ సైకిల్ మీద లిటిల్ హార్ట్స్ బిస్కెట్ ప్యాకెట్ ఉంచే సీన్ అద్భుతంగా ఉంటుంది. ఆవిధంగా లిటిల్ హార్ట్స్ బిస్కెట్స్ చూడగానే ఇప్పటికి అదే సీన్ మైండ్ లోకి వస్తుంది. ఇక హీరో ఎక్స్ ప్రెస్ చేసిన ప్రేమను యాక్సెప్ట్ చేసేందుకు అంజలా ఝావేరో బెలూన్స్ ఊదుతుంది. ఇలాంటి సీన్స్ అప్పటివరకు తెలుగు సినిమాల్లో చూడలేదు. ఓ పక్క ఆమె ఓ ఫ్యాక్షన్ లీడర్ కూతురుగా చూపిస్తూ ఆమెను దక్కించుకోవడం కష్టమని ఫ్యాక్షన్ కథ నడిపించిన దర్శకుడు లవ్ స్టోరీని కూడా అంతే అందంగా తెరకెక్కించాడు. 

 

అప్పటికే చిన్నబ్బాయి, పెళ్లి చేసుకుందాం సినిమాలతో హిట్లు కొట్టిన ఆ ఇయర్ లోనే ప్రేమించుకుందాం రా అంటూ మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు వెంకటేష్. ఆ తర్వాత వచ్చిన గణేష్, ప్రేమంటే ఇదేరా, సూర్యవంశం సినిమాలు కూడా సూపర్ హిట్ అందుకున్నాయి. వెంకటేష్ చేసిన చాల తక్కువ ఫ్యాక్షన్ కథల్లో ప్రేమించుకుందాం రా ఒకటి. ఆ సినిమా కూడా సూపర్ హిట్ అవడంతో వెంకటేష్ మాస్ హీరోగా మరింత మంది ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.  

మరింత సమాచారం తెలుసుకోండి: