ఇండియన్ మూవీ లవర్స్‌ ఎక్కువగా లవ్‌ స్టోరీస్‌ ఎమోషనల్‌ డ్రామాస్‌ చేసేందుకే ఇష్టపడతారు. అయితే అలాంటి సినీ లవర్స్‌ ను కూడా యాక్షన్‌ చిత్రాల పై నడిపించిన స్టార్స్ ఉన్నారు. ఈ లిస్ట్‌ లో అందరికంటే ముందే ఉన్న స్టార్ అర్జున్‌. అతి చిన్న వయసులోనే హీరోగా ఎంట్రీ ఇచ్చిన అర్జున్ కెరీర్‌ స్టార్టింగ్ నుంచి ఎక్కువగా యాక్షన్‌ చిత్రాల మాత్రమే చేస్తున్నాడు. మార్షల్ ఆర్ట్స్‌ నేపథ్యంతో పాటు అప్పట్లో సిక్స్‌ ప్యాక్ బాడీ తో అలరించాడు. ఒక రకంగా సౌత్‌ లో యాక్షన్‌ సినిమాలకు మంచి ఫాం తీసుకువచ్చిన నటుడు అర్జున్‌ అనే  చెప్పాలి.

 

అర్జున్‌ కి చిన్నప్పటి నుంచి దేశ భక్తి కాస్త ఎక్కువగా అందుకే దేశానికి సేవ చేయాలన్న ఉద్దేశం తో పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ లో చేరాలని భావించాడు. 1973లో వచ్చిన బ్రూస్‌ లీ ఎంటర్‌ ది డ్రాగన్ సినిమా చూసి కరాటే నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు అర్జున్. ఆ ఇంట్రస్ట్‌ తోనే 16 ఏళ్ల వయసు నుంచి కరాటే నేర్చుకోవటం ప్రారంభించాడు. ప్రస్తుతం అర్జున్‌ కరాటే లో బ్లాక్ బెల్ట్‌ హోల్డర్. అదే అనుభవంతో సినిమాల్లో అదిరిపోయే యాక్షన్‌ సీన్స్‌ లో నటించాడు అర్జున్.

 

ఇక సినిమాల విషయానికి వస్తే.. 1981లో కన్నడ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. కెరీర్‌ స్టార్టింగ్ లో ఎక్కువగా కన్నడ సినిమాలు మాత్రమే చేసిన అర్జున్‌, తరువాత తమిళ, తెలుగు సినిమా ల్లోనూ పరిచయం అయ్యాడు. హీరోగా తిరుగులేని స్టార్ ఇమేజ్‌ అందుకొని వరుస యాక్షన్‌ సినిమాలతో యాక్షన్‌ కింగ్ అన్న పేరు తెచ్చుకున్నాడు. యంగ్‌ జనరేషన్‌ హీరోల ఎంట్రీ తో సపోర్టింగ్ రోల్స్‌ కు మారిన ఈ యాక్షన్‌ హీరో విలన్‌ గానూ ఆకట్టుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: