మన తెలుగు దర్శకులకు గాని హీరోలకు గాని భయం ప్రయోగాలు చెయ్యాలి అంటే... ఎక్కడ సినిమా ఫ్లాప్ అవుతుందో అనే ఆందోళన చాలా మందిలో ఉంటుంది. ప్రతీ సినిమాను కూడా ఒకటికి పది సార్లు ఆలోచించి తెరకెక్కించే పరిస్థితి ఉంటుంది మన తెలుగులో. ఇక యాక్షన్ సన్నివేశాలు ఉండే సినిమాలను ఒకటికి వంద సార్లు ఆలోచించే ప్రయత్న౦ చేస్తూ ఉంటారు. కానీ హీరోలు మాత్రం కాస్త భయపడిన సరే కథ బాగుంది అంటే కచ్చితంగా ఆ సినిమాను చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. చిరంజీవి బాలకృష్ణ వెంకటేష్ వంటి వారు ఎక్కువగా అలాంటి ప్రయోగాలు ఉన్న సినిమాలను చేయడానికి ఆసక్తి చూపిస్తారు. 

 

వెంకటేష్ కెరీర్ లో యాక్షన్ సన్నివేశాలకు మంచి ప్రాధాన్యత ఉంటుంది. ఆయన నటించిన ఘర్షణ సినిమా ఫ్లాప్ అయినా సరే ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది అనే చెప్పవచ్చు. ఆ సినిమాలో ఆయన నటన తో పాటుగా ముంబై రౌడీ యుజం మీద ఆయన చేసిన పోరాట౦ ఆ తర్వాత హైదరాబాద్ లో రౌడీ యుజం మీద ఆయన చేసిన పోరాటం చాలా బాగా ఆకట్టుకుంది. ఆ సినిమాలో పాండా అనే వాడిని లక్ష్యంగా చేసుకుని ఆయన చేసిన యాక్షన్ చాలా బాగా ఆకట్టుకుంది ప్రేక్షకులను. వెంకటేష్ ఆ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా నటించారు. 

 

ప్రతీ సన్నివేశం కూడా నటనకు ప్రాధాన్యత ఉన్నాదే. ఆయన బ్యాక్ గ్రౌండ్ చెప్పిన విధానం కూడా ప్రేక్షకులకు బాగా దగ్గర అయింది. ఆ సినిమా చాలా మంది ప్రేక్షకులకు ఇప్పటికి ఎక్కదు గాని ఆ సినిమాను ఏ బాలీవుడ్ లోనో తీసి ఉంటే ప్రేక్షకులు బాగా ఆదరించే వారు అనేది చాలా మంది చెప్తూ ఉండే మాట. ఆ సినిమా చాలా మందికి ఎప్పటికప్పుడు కొత్తగా కనపడుతూ ఉంటుంది అనే వాళ్ళు కూడా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: