లాక్ డౌన్ మరో రెండు వారాలు పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవడంతో పాటు ఇప్పటికీ హైదరాబాద్ రెడ్ జోన్ గా కొనసాగుతున్న పరిస్థితులలో షూటింగ్ లకు ప్రభుత్వ అనుమతులు జూన్ నెలలో కూడ లభించే ఆస్కారం కనిపించడం లేదు. దీనితో సినిమాల షూటింగ్ వ్యవహారం మరో రెండు నెలలు అటకెక్కడం ఖాయం అన్న అంచనాలు వస్తున్నాయి. 


షూటింగ్ ల నిలుపుదల వల్ల ఎన్నో సినిమాలు ఆగిపోయినా రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్’ కొరటాల చిరంజీవి ల ‘ఆచార్య’ కష్టాలు మాత్రం చాల ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి. ఈరెండు సినిమాలలోను చరణ్ నటిస్తున్న విషయంతో పాటు ‘ఆచార్య’ మూవీకి చరణ్ కూడ నిర్మాతగా వ్యవహరిస్తున్న పరిస్థితులలో ఈ రెండు సినిమాల రిలీజ్ డేట్స్ ఏమాత్రం క్లాష్ లేకుండా చూసుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. 


ఇలాంటి పరిస్థితులలో తమ రెండు సినిమాల సమస్యల గురించి మనసు విప్పి మాట్లాడుకోవడానికి రాజమౌళి కొరటాల శివ లు ఈ లాక్ డౌన్ సమయంలోనే ఒక ముహూర్తం నిశ్చయించు కున్నట్లు టాక్. ప్రస్తుత పరిస్థితులలో ‘ఆర్ ఆర్ ఆర్’ విడుదల వచ్చే ఏడాది సంక్రాంతికి కూడ కష్టం అన్న సంకేతాలు వస్తున్నాయి. దీనితో ‘ఆర్ ఆర్ ఆర్’ ను వచ్చే ఏడాది సమ్మర్ రేసును వాయిదా వేసే అవకాశం ఉంది. 


అదే జరిగితే ‘ఆచార్య’ ను వచ్చే ఏడాది సంక్రాంతి రేస్ కు తీసుకు రావాలని కొరటాల ప్లాన్. అయితే ఈ మూవీలో ప్రత్యేక పాత్రలో నటిస్తున్న చరణ్ విషయంలో రాజమౌళి నుంచి గ్రీన్ సిగ్నల్ రావాలి. ఇలా ఈ విషయాలు అన్నీ అతి త్వరలో జరగబోతున్న రాజమౌళి కొరటాల సమావేశంలో చర్చకు వచ్చే ఆస్కారం ఉంది అని అంటున్నారు. ఇది చాలదు అన్నట్లుగా ‘ఆచార్య’ నుండి కాజల్ కూడ తప్పుకుంది అని వస్తున్న వార్తలను కొరటాల ఖండించక పోవడంతో ఈ న్యూస్ నిజమా అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఇలా అనేక సమస్యల మధ్య ఇరుక్కుపోయిన ‘ఆర్ ఆర్ ఆర్’ ‘ఆచార్య’ లకు రాజమౌళి కొరటాలలు ఎలాంటి వైద్యం చేస్తారు చూడాలి.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: