హీరో కెరీర్ లో అయినా  హిట్ లు ఫ్లాప్  సహజం.  సక్సెస్ సంతోషాన్నిస్తే ..హిట్   నష్టాన్ని బాధను మిగులుస్తుంది. బట్.. విజయ్ దేవరకొండకు మాత్రం  ఓ సినిమా ఫ్లాప్ పీడకలగా మిగిలిపోయింది. ఆ సినిమా  ఫ్లాప్ అయ్యి నెలలు గడుస్తున్నా.. ఇంకా ఫ్లాప్ ని దెబ్బని మర్చిపోలేకపోతున్నాడు. సూపర్ డూపర్ హిట్ అవుతుందని ఎక్స్ పెక్ట్ చేసిన ఆ సినిమా ఫ్లాప్ అవ్వడానికి రీజనెవరో కూడా చెబుతున్నాడు విజయ్ దేవరకొండ.

 

చూడడానికి ఈజీగోయింగ్ గా కనిపిస్తాడు  కానీ.. కొన్ని విషయాలు మాత్రం చాలా సీరియస్ గా తీసుకుంటాడు విజయ్ దేవరకొండ. ఎంతో కష్టపడి, ఇష్టపడి చేసిన సినిమా ఫ్లాప్ అయితే ఎవరూ అంత  ఈజీగా మర్చిపోరు. కానీ మరీ ఇంతలా  ఆ ఫ్లాప్ ని మనసులో పెట్టుకుని మర్చిపోలేకపోతున్నాడు విజయ్ దేవరకొండ.

 

ఎన్నో ఎక్స్ పెక్టేషన్స్ తో నలుగురు హీరోయిన్స్ తో తెరకెక్కిన వరల్డ్ ఫేమస్ సినమా ట్రైలర్ రిలీజ్ అప్పుడే ఇది  అర్జున్ రెడ్డి రేంజ్ లో మరో హార్డ్ కోర్ లవ్ స్టోరీ, సినిమా సూపర్ హిట్టే అని  అందరూ అనుకున్నారు . కానీ అస్సలు మినిమం హిట్ కూడా అవ్వకుండా బాక్సాఫీస్ దగ్గర అట్టర్ ఫ్లాప్ అయ్యింది వరల్డ్ ఫేమస్ లవర్ . ఆ సినిమా ఫ్లాప్ ఎందుకు అయ్యుందో మళ్లొకసారి గుర్తు చేసుకుంటున్నాడు విజయ్.

 

ఏదో సినిమా ఫ్లాప్ అయ్యింది కదా అని అంతటితో వదిలెయ్యడం లేదు విజయ్. ఇంకా  ఆ సినిమా ఫ్లాప్ పీడకలలా వెంటాడుతూనే ఉంది విజయ్ ని. ఈ మధ్య బాలీవుడ్ క్రిటిక్ రాజీవ్ మసంద్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఈ సినిమా కథ సూపర్ గా చెప్పాడు క్రింతి మాధవ్ . కానీ తెరరకెక్కించేటప్పుడు మాత్రం సినిమాని చెత్తగా తీశాడు అంటూ తన కోపాన్ని , ఫ్రస్టేషన్ ని బటయపెట్టేశాడు . నిజానికి అంతకుముందు డియర్ కామ్రేడ్ ఫ్లాప్ అవడంతో ఈ వరల్డ్ ఫేమస్ లవర్ మీదే ఆశలు పెట్టుకున్న విజయ్.. ఈ సినిమా కూడా ఫ్లాప్ అయ్యే సరికి బ్యాక్ టూ బ్యాక్ ఫ్లాప్స్ తో కెరీర్ లో వెనక్కి వెళ్లిపోయాడు.  అందుకే ఆ ఫ్లాప్ దెబ్బని గుర్తు చేసుకుంటూనే ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: