తెలుగు తెర మీద హీరో లుగా ఎంట్రీ ఇచ్చిన ప్రతీ ఒక్కరు మాస్ యాక్షన్‌ హీరో గా ప్రూవ్ చేసుకోవాలని కష్టపడుతుంటారు. స్టార్ వారసులు గా ఎంట్రీ ఇచ్చిన వారు కూడా ఫైనల్‌ గా యాక్షన్‌ హీరో అని ట్యాగ్ కోసం కష్టపడుతుంటారు. మాస్ హీరో అనిపించుకుంటేనే కమర్షియల్ స్టార్‌ ఇమేజ్‌ వస్తుందన్న ఆలోచన మన ఇండస్ట్రీలో ఉంది. అందుకే అక్కినేని నట వారసుడు నాగచైతన్య కూడా మాస్ యాక్షన్ హీరోగా ప్రూవ్ చేసుకునేందుకు కష్టపడుతున్నాడు.

 

కెరీర్‌ స్టార్టింగ్‌ లో లవర్‌ భాయ్ ఇమేజ్‌ తెచ్చుకున్న నాగచైతన్య తరువాత వరుసగా యాక్షన్ సినిమాలు చేసే ప్రయత్నం చేశాడు. కానీ యాక్షన్‌ హీరో గా ట్రై చేసిన ప్రతీ సారి నాగచైతన్య ఫెయిల్ అయ్యాడు. కెరీర్‌ స్టార్టింగ్‌ లో దడ సినిమాతో తనలోని యాక్షన్‌ యాంగిల్‌ ను చూపించే ప్రయత్నంచేశాడు చైతూ. ఆ సినిమా డిజాస్టర్ అయిన మరో ప్రయత్నంగా బెజవాడ సినిమా చేశాడు. అది కూడా దెబ్బేసింది. తరువాత చేసి తడాఖ కాస్త ఆకట్టుకున్నా నాగచైతన్య కు యాక్షన్‌ ఇమేజ్ మాత్రం రాలేదు.

 

అందుకే మళ్లీ మళ్లీ అదే ప్రయత్నం చేశాడు నాగ చైతన్య తరువాత కూడా ఆటోనగర్ సూర్య లాంటి ప్రయోగం చేశాడు చైతూ అది కూడా డిజాస్టర్ కావటం తో ఆ ప్రయత్నం మానుకున్నాడు. తరువాత తన ఇమేజ్‌ కు తగ్గట్టుగా లవ్ స్టోరీస్‌ తో వరుస సక్సెస్‌ లు అందుకున్నాడు. అయితే హీరోగా సెటిల్ అయిన తరువాత మరోసారి యుద్ధం శరణం, సవ్యసాచి లాంటి సినిమాతో యాక్షన్‌ హీరో ఇమేజ్‌ కోసం ప్రయత్నించాడు. ఈ సినిమాలు కూడా నిరాశపరచటంతో మరోసారి లవర్‌ భాయ్ తరహా సినిమాల మీద దృష్టి పెట్టాడు చైతూ.

మరింత సమాచారం తెలుసుకోండి: