బాలీవుడ్ దిగ్గజం, అప్పటి రొమాంటిక్ హీరో రిషి కపూర్ స్వర్గస్తులవడం అందర్నీ షాక్ కి గురిచేసింది. ఇర్ఫాన్ ఖాన్ మరణాన్నే ఇంకా జీర్ణించుకోలేని బాలీవుడ్ కి, రిషి కపూర్ మరణం మరింత బాధని మిగిల్చింది. బాలనటుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి, ఎన్నో సినిమాల్లో హీరోగా చేసి రొమాంటిక్ హీరో అనిపించుకున్న రిషి కపూర్ ఇక లేడన్న వార్తని బాలివుడ్ తట్టుకోలేకపోతుంది. ఆయనతో సినిమాలు చేసిన వారు ఆ జ్ఞాపకాలని గుర్తుచేసుకుంటున్నారు.

 

 

కళాతపస్వి కే విశ్వనాథ్ రిషికపూర్ తో  ఓ సినిమా చేశాడు. కే విశ్వనాథ్ దర్శకత్వం వహించిన సిరిసిర్ మువ్వ అనే సినిమా హిందీ రీమేక్ ని సర్గం పేరుతో రిషి కపూర్  హీరోగా విశ్వనాథ్ గారు దర్శకత్వం వహించారు. సిరి సిరి మువ్వ సినిమాలోని చంద్రమోహన్ పాత్రలో రిషి కపూర్ నటించారు. ఈ సినిమాలో జయప్రద హీరోయిన్ గా నటించింది. జయప్రదకి అదే మొట్టమొదటి బాలివుడ్ చిత్రం. ఆ సినిమాతో ఆమెకి మంచి పేరొచ్చింది.

 

 

అయితే ఈ సినిమా కోసం ఎన్నో ప్రాంతాలు  తిరిగిన చిత్ర బృందం రాజమండ్రిలోని గోదావరి తీరానికి కూడా చేరింది. కాశ్మీర్ లోయలు, ఊటీ వంటి ప్రదేశాల్లో చిత్రీకరణ జరుపుకున్న తర్వాత మన గోదావరి తీరానికి వచ్చారు. అక్కడ ఉరకలు వేస్తున్న గోదావరిని చూసి రిషి కపూర్ ఎంతో ముచ్చటపడ్డాడట. ఇసుక తిన్నెల పక్కన షూటింగ్ జరుపుకోవడం ఆయనకి ఎంతో ఆనందాన్ని ఇచ్చిందట. ఈ విషయాన్ని కే విశ్వనాథ్ గారు పంచుకున్నారు.

 

సర్గం సినిమా తెలుగులో మాదిరిగానే హిందీలోను మంచి విజయం అందుకుంది. అయితే ఆ తర్వాత మళ్లీ రిషి కపూర్, కే విశ్వనాథ్ గారు కలిసి చేసిన సినిమాలు లేవు. బాలీవుడ్ దిగ్గజ నటుడికి మన గోదావరితో అనుబంధం ఉందంటే మనతో ఉన్నట్టే..

 

మరింత సమాచారం తెలుసుకోండి: