కెరియర్ ప్రారంభం నుండి సినిమాల పై ఏమాత్రం శ్రద్ధ పెట్టని పవన్ కళ్యాణ్ ఎప్పుడు లేని విధంగా తన కెరియర్ లో ఒకేసారి రెండు సినిమాలలో నటిస్తూ ఇండస్ట్రీ వర్గాలతో పాటు తన అభిమానులకు కూడ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా సమస్యతో తన యాక్షన్ ప్లాన్ ఎలా మార్చుకోవాలి అన్న విషయమై ప్రస్తుతం లాక్ డౌన్ పిరియడ్ పవన్ తీవ్ర ఆలోచనలలో ప్రస్తుతం తన ఫామ్ హౌస్ లో రోజులు గడుపుతున్నాడు అంటూ ఈరోజు ఒక ప్రముఖ ఇంగ్లీష్ దినపత్రిక ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది. 


గత సంవత్సరం ఎన్నికలలో పవన్ ‘జనసేన’ ఘోర పరాజయం చెందడంతో ఆ పార్టీ మనుగడ ఉండదు అని అందరు భావించారు. అయితే అందరి ఊహలను తల క్రిందులు చేస్తూ ఎన్నికల ఓటమి తరువాత గత ఆరు నెలలుగా పవన్ ‘జనసేన’ పార్టీని పరుగులు తీయిస్తున్నాడు. 


కరోనా సమయంలో కూడ జనసైనికులు ప్రజల మధ్యకు వెళ్ళి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉండటంతో గత కొద్ది నెలలుగా ప్రజలలో జనసేన గ్రాఫ్ పెరిగింది అన్న వాస్తవాన్ని రాజకీయ వర్గాలు కూడ గుర్తిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులలో తాను ఒప్పుకుని ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న రెండు సినిమాలను త్వరగా పూర్తి చేసి మరో మూడు సినిమాలను కూడ వచ్చే ఏడాది చివరిలోపున పూర్తి చేసి పారితోషికంగా వచ్చిన ఆ డబ్బులో కొంత భాగం జనసేన కోసం ఖర్చు పెట్టాలి అని పవన్ వేసుకున్న టోటల్ యాక్షన్ ప్లాన్ పూర్తిగా రివర్స్ కావడంతో పవన్ తీవ్ర ఆలోచనలలో ఉన్నట్లు టాక్.


దీనికితోడు ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ‘వకీల్ సాబ్’ క్రిష్ సినిమాలకు సంబంధించి పవన్ తన పారితోషికాన్ని తగ్గించుకుని తమకు సహకరించమని ఆ సినిమాల నిర్మాతలు చేస్తున్న రాయబారాలతో పవన్ పారితోషికంలో కూడ కోతపడే ఆస్కారం ఉంది అని అంటున్నారు. దీనికితోడు ఈ సినిమాల తరువాత పవన్ నటించవలసిన హరీష్ శంకర్ మూవీతో పాటు మరో రెండు సినిమాల నిర్మాతలు కూడ ఆ సినిమాలు ఇంకా మొదలు అవ్వకుండానే పవన్ ను అతడి పారితోషికం తగ్గించుకోమని అభ్యర్దిస్తున్నట్లు టాక్. దీనితో స్వతహాగా సున్నిత మనస్కుడైన పవన్ తన నిర్మాతల మాటలు కాదనలేక ‘జనసేన’ ను ఆర్ధిక పరంగా రక్షించడానికి తాను ఎంచుకున్న సినిమాల రీ ఎంట్రీ ప్లాన్ వర్కౌట్ అవ్వక ఏమిచేయాలో తెలియని అయోమయ స్థితిలో ఉన్నాడు అంటూ ఆ పత్రిక తన కథనంలో వివరంగా పేర్కొంది..

మరింత సమాచారం తెలుసుకోండి: