పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టార్ క్రేజ్ తెచ్చుకున్న నాటి నుండి ఇప్పటివరకు 25 సినిమాల్లో నటించారు. సినిమాలు చేస్తూనే అవసరమైన వారికి సహాయం చేస్తూ ఉంటాడు. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మిగతా స్టార్ హీరోలతో కూడా చాలా సరదాగా ఉంటాడు. ఎలాంటి భేషజాలు లేకుండా మంచి రిలీషన్ ను మెయిన్టైం చేస్తున్నాడు. తానొక స్టార్ హీరో అనే పొగరు పవన్ లో ఎక్కడా కనబడదు. అంతేకాదు తనతో సమానమైన క్రేజ్ ఉన్న స్టార్ హీరోలనే కాదు కొత్తగా వచ్చిన వారితో కూడా చాలా సరదాగా ఉంటాడు. 

 

అంతేకాదు పవన్ క్రేజ్ ను వాడుకుని యువ హీరోలు కూడా తమ సినిమాలను ప్రమోట్ చేస్తుంటారు. అవసరం ఉన్నా లేకున్నా సరే పవన్ ఇమేజ్ ను.. పవర్ స్టార్ పేరుని సినిమాల్లో వాడి ఆయన ఫ్యాన్స్ ను ఎట్రాక్ట్ చేస్తారు. కొత్త హీరో సినిమా అయినా సరే పవర్ స్టార్ పేరు ప్రస్తావించి సినిమాకు అదనపు క్రేజ్ తెచ్చుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ బొమ్మ పెట్టుకుని కూడా సినిమాను హిట్ చేసుకుంటున్నారు. అందులో యువ హీరో నితిన్ ముందుంటాడు.. పవర్ స్టార్ క్రేజ్ ను వాడుకుంటూ మెగా హీరోలకన్నా  తానే పెద్ద ఫ్యాన్ అని చెప్పుకుంటాడు. 

 

పవన్ కళ్యాణ్ ఇమేజ్ ను వాడుకునే స్టార్స్ కూడా ఉన్నారు. మెగా హీరోలు అందరు ఎక్కడో ఒకచోట పవన్ కళ్యాణ్ నామ జపం చేస్తూనే ఉన్నారు. మెగా ఈవెంట్స్ ఏదైనా సరే పవర్ స్టార్ ఫ్యాన్స్ హంగామా ఉండాల్సిందే. ఆఖరికి చిరంజీవి స్టేజ్ మీద ఉన్నా సరే పవర్ స్టార్ ఫ్యాన్స్ కేకలేయడం కామన్.. ఈ విషయం దగ్గరే అల్లు అర్జున్ పవన్ ఫ్యాన్స్ తో గొడవ పడ్డ విషయం తెలిసిందే. ఏది ఏమైనా పవన్ క్రేజ్ వాడేస్తూ పవన్ కళ్యాణ్ అందరివాడు అనిపించేలా చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: