చిరంజీవి కెరీర్ లో ప్రత్యేకంగా చెప్పుకునే సినిమా ఇంద్రా. రాయలసీమ ఫ్యాక్షన్ ఆధారంగా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. చిరంజీవి ప్రత్యర్ధిగా నటించిన ముఖేష్ ఋషీ కూడా చాలా బాగా నటించారు. ఈ సినిమాలో చిరంజీవి నటన చూసిన ప్రేక్షకులు సాహో అన్నారు. అక్కడి నుంచే ఆయన రాజకీయాల్లోకి రావాలి అనే డిమాండ్ కూడా వినపడింది అనేది వాస్తవం. ఆయన నటన ఫ్యాక్షన్ కోణం లో చూసిన వాళ్లకు చాలా బాగా నచ్చుతుంది. ఆ సినిమా తో చిరంజీవి రేంజ్ మరో స్థాయికి వెళ్ళింది అనేది వాస్తవం. 

 

తన కుటుంబం మొత్తం చనిపోయిన తర్వాత చిరంజీవి వెంటాడి వేటాడి వాళ్ళను చంపాలి అనుకోవడం సినిమాకు హైలెట్ గా నిలుస్తుంది. ఇక ఆ సినిమాలో ఆర్తీ అగర్వాల్ నటన ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. స్నేహ లతా రెడ్డి గా ఆమె చేసిన యాక్షన్ కి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. టాలీవుడ్ లో ఈ సినిమా ఎన్నో రికార్డులు బద్దలు కొట్టింది. ఇక ఆ సినిమాలో ఉన్న కొన్ని డైలాగులు కూడా బాగానే నచ్చాయి ప్రేక్షకులకు. వీర శంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా అంటూ చిరంజీవి చెప్పిన డైలాగ్ ఇప్పటికి కూడా ఫేమస్. 

 

సినిమా తర్వాత చిరంజీవి టాగూర్ సినిమాలో నటించారు. ఆ సినిమా కూడా మంచి విజయం సాధించింది. ఇంద్రా సినిమాలో చిరంజీవి నటనకు అవార్డులు కూడా వచ్చాయి. ఆ సినిమాలో ఫ్యాక్షన్ ని పగను చూపించిన విధానం చూసి బాలీవుడ్ కూడా షాక్ అయింది. ముఖేష్ ఋషీ విలన్ గా చాలా బాగా నటించారు. ఆ విధంగా సినిమా ప్రేక్షకులకు బాగా దగ్గర అయింది. ప్రస్తుతం చిరంజీవి ఆచార్య అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా వచ్చే ఏడాది రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: